Telugu Global
National

భారత క్రికెట్లో ధోనీ కథ ముగిసినట్లే

ఇక రిటైర్మెంటే అంటున్న గవాస్కర్ భారత ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్రసింగ్ ధోనీకి భారతజట్టులో చోటు దక్కడం అంతతేలికకాదని, ద్వారాలు దాదాపు మూసుకుపోయినట్లేనని మాజీ కెప్టెన్, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్ర్రేలియా వేదికగా అక్టోబర్లో జరిగే 2020 టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనడం ద్వారా ధోనీ రిటైర్ కావాలని భావిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.గత ఏడుమాసాలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న ధోనీ.ఐపీఎల్ -13 ద్వారా రీ-ఎంట్రీకి సిద్ధమైనా […]

భారత క్రికెట్లో ధోనీ కథ ముగిసినట్లే
X
  • ఇక రిటైర్మెంటే అంటున్న గవాస్కర్

భారత ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్రసింగ్ ధోనీకి భారతజట్టులో చోటు దక్కడం అంతతేలికకాదని, ద్వారాలు దాదాపు మూసుకుపోయినట్లేనని మాజీ కెప్టెన్, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

ఆస్ట్ర్రేలియా వేదికగా అక్టోబర్లో జరిగే 2020 టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనడం ద్వారా ధోనీ రిటైర్ కావాలని భావిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే.గత ఏడుమాసాలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న ధోనీ.ఐపీఎల్ -13 ద్వారా రీ-ఎంట్రీకి సిద్ధమైనా కరోనా వైరస్ దెబ్బతో అవకాశం చేజార్చుకోవాల్సి వచ్చింది.

కరోనా వైరస్ పరిస్థితి ఇలాగా కొనసాగితే.ఐపీఎల్ తో పాటు ప్రపంచకప్ సైతం వాయిదా పడినా ఆశ్చర్యంలేదు. అదే జరిగితే భారతజట్టులో తిరిగి చోటు పొందడం ధోనీకి అసాధ్యమని. ద్వారాలు మూసుకుపోయినట్లేనని, ఎలాంటి ఆర్భాటమూ లేకుండా రిటైర్మెంట్ కాక తప్పదని గవాస్కర్ చెప్పారు.

తన వరకూ. అపార అనుభవం ఉన్న ధోనీ లాంటి ఆటగాడు భారతజట్టులో ఉంటే బాగుండునని అనిపిస్తుందని..అయితే తిరిగి సత్తాచాటుకొంటేనే భారతజట్టులో చోటు కల్పిస్తామని అటు ఎంపిక సంఘం సభ్యులు, ఇటు చీఫ్ కోచ్ రవిశాస్త్రి చెప్పడం చూస్తుంటే.రీ-ఎంట్రీ అంతతేలికకాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని గవాస్కర్ తేల్చి చెప్పారు.

కొద్దిరోజుల క్రితమే భారతమాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం..ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గతంలోనే సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ. ఆ తర్వాత నుంచి వన్డే, టీ-20 ఫార్మాట్లలో కొనసాగుతూ వచ్చాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీస్ లో చివరిసారిగా భారతజట్టులో సభ్యుడుగా పాల్గొన్నాడు.

న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ లో భారత పరాజయంతో ధోనీ తన కెరియర్ లో ఆఖరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడినట్లయ్యింది. ఆ తర్వాత నుంచి తనకుతానుగా
క్రికెట్ కు దూరమై. కుటుంబానికి, వ్యక్తిగత పనులకు సమయం కేటాయించడం ద్వారా గడిపాడు.

మొత్తం మీద. టీ-20 ప్రపంచకప్ విజయంతో అట్టహాసంగా రిటైర్ కావాల్సిన ధోనీ.క్రికెట్ మ్యాచ్ లను గొప్పగా ముగించడంలో దిట్టగా పేరుపొందిన మహీ. చివరకు
తన కెరియర్ ను ఎలా ముగించగలడన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

First Published:  22 March 2020 1:18 AM GMT
Next Story