Telugu Global
NEWS

ఏపీలో ఇంటింటికి సర్వే... బెజవాడలో 144 సెక్షన్‌ !

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయిన ప్రాంతాల్లో అధికార యంత్రాంగం హైఅలర్ట్‌ ప్రకటించింది. విశాఖ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరులో స్ధానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. గ్రామ వాలంటీర్లు, రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బందితో కూడిన బృందాలతో ఇంటింటికి సర్వే చేస్తున్నారు. ప్యారిస్‌ నుంచి విజయవాడ వచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ కావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ నెల 17, 18వ తేదీల్లో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నాడు. 18న జ్వరం రావడంతో అనుమానంతో […]

ఏపీలో ఇంటింటికి సర్వే... బెజవాడలో 144 సెక్షన్‌ !
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయిన ప్రాంతాల్లో అధికార యంత్రాంగం హైఅలర్ట్‌ ప్రకటించింది. విశాఖ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరులో స్ధానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. గ్రామ వాలంటీర్లు, రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బందితో కూడిన బృందాలతో ఇంటింటికి సర్వే చేస్తున్నారు.

ప్యారిస్‌ నుంచి విజయవాడ వచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ కావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ నెల 17, 18వ తేదీల్లో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నాడు. 18న జ్వరం రావడంతో అనుమానంతో ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. ఆ సమయంలో వైద్యులు అతన్ని పరీక్షించి రక్తనమూనాలు ల్యాబ్‌కు పంపించారు. బాధితుడి ఇంటికి 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో కూడిన 50 బృందాలతో సర్వే చేశారు.

విజయవాడలో ఏప్రిల్‌ 14వ తేదీ వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

అటు విశాఖలో కరోనా నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి 144 సెక్షన్‌ అమలుచేస్తున్నట్లు ప్రకటించారు పోలీస్‌ అధికారులు. అటు అనుమానితులు పెరుగుతుండడంతో విమ్స్‌లో 400 పడకలు ఏర్పాటు చేయడంతో పాటు ఆంధ్ర వైద్య కళాశాలలో 200 పడకలు సిద్దం చేయనున్నట్టు మంత్రి అవంతి తెలిపారు. కష్ట సమయంలో ప్రజలు బాధ్యతగా ఉండాలన్నారు మంత్రి అవంతి.

ఏపీలో కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని… విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా పెట్టిందని…. అలాంటి వారి సమాచారం ఉంటే గ్రామవాలంటీర్లకు తెలియజేయాలని కోరారు.

నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ వ్యక్తికి నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అనుమానితులను వెంటనే చెక్‌ చేసేందుకు ర్యాపిడ్‌ మెడికల్‌ టీంను అధికారలు సిద్దం చేశారు. ప్రైవేట్‌ కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బందిని కూడా ధర్మల్‌ స్కాన్‌ చేసిన తర్వాతే అనుమతించాలని ఆదేశించారు.

అటు ఒంగోలు కరోనా పాజిటివ్‌ యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆ యువకుడి తల్లి, తండ్రి, చెల్లికి నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది.

First Published:  23 March 2020 10:10 AM GMT
Next Story