Telugu Global
Cinema & Entertainment

చేతిలో 2 రీమేక్స్... ఓటు దేనికి?

తెలుగు సినిమా రీమేక్స్ కు ఇప్పుడు బాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. మరీ ముఖ్యంగా అర్జున్ రెడ్డికి రీమేక్ గా హిందీలో వచ్చిన కబీర్ సింగ్ సూపర్ డూపర్ హిట్టవ్వడంతో మరోసారి తెలుగు రీమేక్స్ కు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో రీసెంట్ గా వచ్చిన రెండు సినిమా రీమేక్ రైట్స్ ను బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ దక్కించుకున్నాడు. వాటిలో ఒకటి డియర్ కామ్రేడ్ కాగా, రెండోది భీష్మ సినిమా. ఈ రెండు […]

చేతిలో 2 రీమేక్స్... ఓటు దేనికి?
X

తెలుగు సినిమా రీమేక్స్ కు ఇప్పుడు బాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. మరీ ముఖ్యంగా అర్జున్ రెడ్డికి రీమేక్ గా హిందీలో వచ్చిన కబీర్ సింగ్ సూపర్ డూపర్ హిట్టవ్వడంతో మరోసారి తెలుగు రీమేక్స్ కు డిమాండ్ పెరిగింది.

ఈ క్రమంలో రీసెంట్ గా వచ్చిన రెండు సినిమా రీమేక్ రైట్స్ ను బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ దక్కించుకున్నాడు. వాటిలో ఒకటి డియర్ కామ్రేడ్ కాగా, రెండోది భీష్మ సినిమా.

ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమాను ఓ స్టార్ హీరోతో రీమేక్ చేయాలనేది కరణ్ జోహార్ ఆశ. తను నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తూ, మరో యంగ్ డైరక్టర్ కు ఆ ప్రాజెక్టు అప్పగించాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగా హీరో రణబీర్ కపూర్ ను కలిశాడు కరణ్ జోహార్. డియర్ కామ్రేడ్, భీష్మ సినిమాల డీవీడీలు రెండూ అందించాడు.

ప్రస్తుతానికైతే ఈ రెండు సినిమాల రీమేక్స్ రణబీర్ కపూర్ దగ్గర ఆగాయి. వాటిలోంచి ఒకటి రణబీర్ సెలక్ట్ చేయాల్సి ఉంది. రణబీర్ కు ఏ సినిమా నచ్చితే ఆ సినిమా రీమేక్ తో సెట్స్ పైకి వెళ్లాలనేది కరణ్ ఆలోచన. ఒకవేళ రణబీర్ కు రెండు సినిమాలూ నచ్చకపోతే, అప్పుడు మరో హీరోను ఈ రెండు సినిమాలతో సంప్రదిస్తాడు కరణ్.

First Published:  23 March 2020 6:40 AM GMT
Next Story