మహేష్ బాబు కొత్త సినిమా ఫిక్స్.. దర్శకుడు ఇతడే

‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తాడనే ఉత్కంఠ దాదాపు వీడినట్టే కనిపిస్తోంది. వంశీ పైడిపల్లితో సినిమా ఆల్ మోస్ట్ ఓకే అయ్యి కథ మొత్తం విన్నాక బాగాలేకపోవడంతో మహేష్ బాబు రిజెక్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న మహేష్ తన తదుపరి సినిమాను పట్టాలెక్కించినట్టు తెలిసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు తరువాత సినిమా‘ గీతా గోవిందం’ ఫేమ్ పరశురాంతో తీయబోతున్నట్టు టాలీవుడ్ సమాచారం. ఈ మేరకు డీల్ ఒకే అయినట్టు తెలిసింది.

మహేష్ బాబు… దర్శకుడు పరశురాం తో కలిసి ఎప్పుడో పనిచేయాల్సింది. కానీ మధ్యలో ఇతర ప్రాజెక్టుల వల్ల దీన్ని మహేష్ పక్కనపెట్టాడు.

ప్రస్తుతం దర్శకుడు పరశురాం 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న తన తదుపరి ప్రాజెక్టును చేపట్టాడు. నాగచైతన్య హీరోగా సినిమా తీస్తున్నాడు. పరుశరాం ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 14 రీల్స్ సంస్థతోనే చేయాల్సి ఉంది. అందుకే ప్రస్తుతం ఈ సినిమా పూర్తి అయ్యాకే 14 రీల్స్ తో మహేష్ సినిమా పట్టాలెక్కనుంది.

కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం నాగచైతన్య-పరశురాం చిత్రం సెట్ మీదకు వెళ్ళలేదు. చిత్ర పరిశ్రమ మళ్లీ పునరుద్ధరణ జరిగే వరకు సినిమా పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో మహేష్ బాబుతో పరశురాం సినిమా మరింత ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది.