మహేష్ పై మండిపడుతున్న నాగార్జున

సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన పనికి కింగ్ నాగార్జున హర్ట్ అయినట్లు తెలుస్తోంది. తన సినిమాలతో బీజీగా ఉండే సూపర్ స్టార్.. కింగ్ ను హర్ట్ చేయడం ఏంటీ అనుకుంటున్నారా.. అదేమీ లేదండీ.. ఓ సినిమా దర్శకుడి విషయంలో వచ్చిన క్లాష్ వీరిద్దరి మధ్య గ్యాప్ కు దారితీసేలా ఉండటంతో అసలు విషయం తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

దర్శకుడు పరశురామ్ నాగార్జున కుమారుడు నాగచైతన్యతో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఇటీవల అఫిషియల్ గా అనౌన్స్ చేశాడు. అయితే పరశురామ్ చెప్పిన కథ విన్న నాగర్జున కొన్ని మార్పులు చేయాలని సూచించాడట. దీనికి పరశురామ్ ఓకే చెప్పి రెగ్యూలర్ షూటింగ్ కోసం డేట్స్ కూడా కేటాయించినట్లు సమాచారం. అయితే షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుందనగా పరశురామ్ తనకు మహేష్ తో సినిమా ఓకే అయిందని.. దీంతో చైతుతో సినిమా చేయడం కష్టమని అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తానంటూ చెప్పినట్లు తెలుస్తోంది.

‘గీతాగోవిందం’లాంటి బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న దర్శకుడు పరశురామ్ చైతుతో సినిమా చేస్తే తన కుమారుడికి మంచి క్రేజ్ వస్తుందని కింగ్ భావించాడు. ఇంతలో మహేష్ దర్శకుడు పరశురామ్ కు సినిమా ఆఫర్ ఇవ్వడంతో చైతుతో సినిమా అటకెక్కేలా మారింది.

దీంతో కింగ్… మహేష్ చేసిన పనికి హర్ట్ అయినట్లు తెలుస్తోంది. పరశురామ్ చెప్పిన కథ మహేష్ కు నచ్చితే… చైతుతో సినిమా తర్వాత చేస్తానని చెబితే బాగుండేదని కింగ్ భావిస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో చర్చ నడుస్తోంది.

అయితే మహేష్ బాబు పరశురామ్ తోపాటు బీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములను కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరీతో సినిమా చేయాలనే డైలామాలో మహేష్ ఉన్నాడట.

మహేష్ ఒకవేళ భీష్మ డైరెక్టర్ తో సినిమా చేస్తే మాత్రం చైతుకు లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. వీరిద్దరిలో మహేష్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడో వేచి చూడాల్సిందే..!