Telugu Global
International

కరోనా పురుషులనే చంపేస్తోంది? ఎందుకు?

కరోనా కల్లోలం ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వేల మంది ప్రాణాలు తీస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని ప్రస్తుతం వైరస్ పుట్టిన దేశం చైనా అరికట్టింది. కరోనాపై తీవ్రంగా పరిశోధన చేసిన చైనా దేశం ఓ కొత్త విషయాన్ని కనుగొంది. దీని ప్రభావంతో మహిళల కంటే ఎక్కువగా పురుషులు చనిపోతున్నారని కొత్త విషయాన్ని కొనుగొంది. కరోనా వైరస్ ఆడ, మగ అనే తేడా లేకుండా సోకుతుంది. సమానం గా దాడి చేస్తోంది. అయితే మరణాల రేటు చూస్తే ఎక్కువ […]

కరోనా పురుషులనే చంపేస్తోంది? ఎందుకు?
X

కరోనా కల్లోలం ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వేల మంది ప్రాణాలు తీస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని ప్రస్తుతం వైరస్ పుట్టిన దేశం చైనా అరికట్టింది.

కరోనాపై తీవ్రంగా పరిశోధన చేసిన చైనా దేశం ఓ కొత్త విషయాన్ని కనుగొంది. దీని ప్రభావంతో మహిళల కంటే ఎక్కువగా పురుషులు చనిపోతున్నారని కొత్త విషయాన్ని కొనుగొంది.

కరోనా వైరస్ ఆడ, మగ అనే తేడా లేకుండా సోకుతుంది. సమానం గా దాడి చేస్తోంది. అయితే మరణాల రేటు చూస్తే ఎక్కువ మంది మగవారు చనిపోతున్నారు.

కరోనా వైరస్ సోకిన కేసుల వివరాలను చైనా విశ్లేషించింది. మొత్తం 72,314 కరోనా కేసులు చైనాలో నమోదు చేశారు. వీరిలో 51.4 శాతం మంది పురుషులు ఉండగా.. 48.6 మంది మహిళలు ఉన్నారు. కానీ మరణించిన వారిలో 63.8 శాతం మంది పురుషులు ఉన్నారు. 36.2 శాతం మంది మాత్రమే మహిళలు చనిపోతున్నారని పరిశోధనలు తెలుపుతున్నాయి.

దీనికి కారణం స్రీలు పురుషుల వలే ఇళ్లను వీడిచిపెట్టరు. అందుకే వారికి కరోనా తక్కువగా సోకుతోంది. మరో ఆసక్తికరమైన లక్షణం ఏంటంటే సామాజిక దూరాన్ని పాటించినప్పటికీ పిల్లలు కరోనా వైరస్ బారిన పడడం లేదు.

First Published:  23 March 2020 8:30 PM GMT
Next Story