Telugu Global
International

కరోనాపై పోరుకు క్రీడాకారుల ఆర్ధికసాయం

ఆరునెలల జీతం చందాగా ప్రకటించిన భజరంగ్ ఎంపీ లాడ్ నుంచి గంభీర్ 50 లక్షల కేటాయింపు కరోనా మహమ్మారితో పోరాటానికి తనవంతుగా ఆరుమాసాల జీతాన్ని చందాగా ఇస్తున్నట్లు భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా ప్రకటించాడు. అయితే… జులైలో ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్ ను వాయిదా వేయాలని కోరాడు. ప్రపంచమంతా కరోనా వైరస్ ముప్పుతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్న సమయంలో.. ఒలింపిక్స్ ను నిర్వహించడంలో అర్థంలేదని, అథ్లెట్ల మానసికస్థితిని, ఆరోగ్యాన్ని సైతం దృష్టిలో ఉంచుకోవాలని సూచించాడు. భారత రైల్వేస్ […]

కరోనాపై పోరుకు క్రీడాకారుల ఆర్ధికసాయం
X
  • ఆరునెలల జీతం చందాగా ప్రకటించిన భజరంగ్
  • ఎంపీ లాడ్ నుంచి గంభీర్ 50 లక్షల కేటాయింపు

కరోనా మహమ్మారితో పోరాటానికి తనవంతుగా ఆరుమాసాల జీతాన్ని చందాగా ఇస్తున్నట్లు భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా ప్రకటించాడు. అయితే… జులైలో ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్ ను వాయిదా వేయాలని కోరాడు.

ప్రపంచమంతా కరోనా వైరస్ ముప్పుతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్న సమయంలో.. ఒలింపిక్స్ ను నిర్వహించడంలో అర్థంలేదని, అథ్లెట్ల మానసికస్థితిని, ఆరోగ్యాన్ని సైతం దృష్టిలో ఉంచుకోవాలని సూచించాడు.

భారత రైల్వేస్ లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా విధి నిర్వర్తిస్తున్న 25 సంవత్సరాల భజరంగ్ పూనియాకు ప్రపంచ కుస్తీ పోటీలలో భారత్ కు కాంస్య పతకం సాధించిన ఘనత ఉంది.

అంతేకాదు …టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు ఏదో ఒక పతకం అందించగల మొనగాడిగా కూడా భజరంగ్ పూనియాకు పేరుంది.

ఎంపీ లాడ్ నిధుల నుంచి గంభీర్ 50 లక్షలు…

కరోనా వైరస్ ముప్పును అరికట్టడానికి ఢిల్లీ రాష్ట్ర్రప్రభుత్వం చేస్తున్న పోరాటంలో తాను సైతం అండగా నిలుస్తానని భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ప్రకటించారు. తన ఎంపీ లాడ్ నిధుల నుంచి 50 లక్షల రూపాయల మొత్తాన్ని కోవిడ్-19 నివారణకు కేటాయించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఓ లేఖద్వారా తెలిపాడు.

కరోనా వైరస్ తో పోరాటంలో ప్రభుత్వ సూచనలను పాటించని పౌరులను జైలుకు పంపేలా కఠినంగా చర్యలు తీసుకోవాలని సూచించాడు.

మార్చి 22న జనతా కర్ఫ్యూ ముగిసిన వెంటనే ఢిల్లీ వీధుల్లో జనం గుంపులు గుంపులుగా సంచరించారని, దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని, తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరాడు. క్వారెంటైయిన్ పాటించకుండా రోడ్లపైకి వచ్చేవారని జైలుకు పంపాలని కోరాడు.

చైనాలోని ఊహాన్ నుంచి ప్రపంచ దేశాలపై దాడికి దిగిన కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికే విశ్వవ్యాప్తంగా 16 వేల 500 మందిని పొట్టన పెట్టుకొంది.

First Published:  23 March 2020 8:33 PM GMT
Next Story