ఈ ఖాళీ టైమ్ లో నాని చేస్తున్న పని ఇది

కరోనా వల్ల టాలీవుడ్ మొత్తం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంది. హీరోహీరోయిన్లు, దర్శకులు అనే తేడా లేకుండా అంతా ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ ఖాళీ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా సద్వినియోం చేసుకుంటున్నారు. నాని అయితే ఏకంగా వంటోడి అవతారం ఎత్తాడు.

జీవితంలో ఇప్పటివరకు తను వంట గదిలోకి వెళ్లలేదని, కనీసం తనకు స్టౌవ్ ఆన్ చేయడం కూడా రాదని.. అలాంటిది కరోనా దయ వల్ల ఇప్పుడు ఏకంగా కుక్ గా మారిపోయానని చెప్పుకొచ్చాడు నాని. చెన్నామసాలా (కొమ్ము శనగల కర్రీ) కూర తయారీ నేర్చుకున్నానని తెలిపాడు.

నాని మాత్రమే కాదు.. టాలీవుడ్ లో చాలామంది ఇలా తమకు నచ్చిన వ్యాపకంలో పడిపోయారు. నటుడు శివాజీ రాజా ఎఁచక్కా తన ఫామ్ హౌజ్ లో కూరగాయలు పండించుకుంటున్నాడు. సుధీర్ బాబు అయితే రోజుకో ఎక్సర్ సైజ్ చేస్తూ ఆ వీడియోలు పెడుతున్నాడు. ఇక హీరోయిన్లయితే ఇంట్లో కూర్చొని రకరకాల వంటకాలు తింటూ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.