ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ అదిరింది

రాజమౌళి ఏం చేసినా అందులో ఎంతో కొత్తదనం, మరెంతో రిచ్ లుక్ ఉంటుంది. ప్రేక్షకుల పల్స్ తెలిసిన జక్కన్న.. వాళ్ల అంచనాల్ని ఎప్పుడూ వమ్ము చేయడు. ఆర్ఆర్ఆర్ తో ఇప్పుడా విషయం మరోసారి ప్రూవ్ అయింది. ఉగాది సందర్భంగా ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు రాజమౌళి. ప్రేక్షకుల అంచనాల్ని అందుకున్నాడు.

ఈ సినిమాకు ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు రాజమౌళి. ఇక హిందీ వెర్షన్ కు రైజ్-రోన్-రివోల్ట్ అనే ఇంగ్లిష్ టైటిల్ ను ఫిక్స్ చేశాడు. పాన్-ఇండియా అప్పీల్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు జక్కన్న.

ఓవైపు కరోనా భయాలు కొనసాగుతున్న వేళ విడుదలైన ఈ మోషన్ పోస్టర్ జనాలకు కాస్త ఉపశమనం ఇచ్చింది. మోషన్ పోస్టర్ లో రాజమౌళి నీరు-నిప్పు కాన్సెప్ట్ ను చూపించాడు. చరణ్ ను నిప్పుతో, ఎన్టీఆర్ ను నీటితో పోలుస్తూ మోషన్ పోస్టర్ క్రియేట్ చేశారు. ఇలాంటి రెండు అతీతమైన ప్రకృతి శక్తులు కలిస్తే ఆ యుద్ధం ఎలా ఉంటుందో ఆర్ఆర్ఆర్ లో చూడబోతున్నామనే విషయం మోషన్ పోస్టర్ తో తేలిపోయింది.