Telugu Global
Cinema & Entertainment

స్వీయ నిర్బంధంలో శృతిహాసన్

ప్రస్తుతం దేశమంతా స్వీయ నిర్బంధాన్ని అనుసరిస్తున్న టైమ్ ఇది. స్వయంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో అంతా ఇళ్లకే పరిమితమైపోయారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారి సంగతైతే చెప్పనక్కర్లేదు. వాళ్లను మరింత నిఘాలో, ప్రత్యేక పర్యవేక్షణ కింద ఉంచారు. వాళ్ల దగ్గరకు వెళ్లడానికి కూడా అంతా భయపడుతున్నారు. ఇప్పుడు శృతిహాసన్ పరిస్థితి కూడా ఇదే. ఈమధ్యే లండన్ నుంచి ఇండియా వచ్చింది శృతిహాసన్. ఎయిర్ పోర్ట్ లోనే ఆమెను ఆపారు. స్క్రీనింగ్ పూర్తిచేసి, ఇంట్లోనే 2 […]

స్వీయ నిర్బంధంలో శృతిహాసన్
X

ప్రస్తుతం దేశమంతా స్వీయ నిర్బంధాన్ని అనుసరిస్తున్న టైమ్ ఇది. స్వయంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో అంతా ఇళ్లకే పరిమితమైపోయారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారి సంగతైతే చెప్పనక్కర్లేదు. వాళ్లను మరింత నిఘాలో, ప్రత్యేక పర్యవేక్షణ కింద ఉంచారు. వాళ్ల దగ్గరకు వెళ్లడానికి కూడా అంతా భయపడుతున్నారు. ఇప్పుడు శృతిహాసన్ పరిస్థితి కూడా ఇదే.

ఈమధ్యే లండన్ నుంచి ఇండియా వచ్చింది శృతిహాసన్. ఎయిర్ పోర్ట్ లోనే ఆమెను ఆపారు. స్క్రీనింగ్ పూర్తిచేసి, ఇంట్లోనే 2 వారాలు ఉండాలని, ఎవ్వర్నీ కలవకూడదని కండిషన్ పెట్టారు. చెప్పినట్టుగానే ముంబయిలోని తన ఇంట్లో ఉండిపోయింది శృతిహాసన్. ప్రస్తుతం తనకు తన తల్లి కూడా తోడుగా లేదని, ఆమె వేరే అపార్ట్ మెంట్ లో స్వీయ నిర్బంధంలో ఉందని చెప్పుకొచ్చింది.

తన పెంపుడు పిల్లి మాత్రమే తనకు తోడుగా ఉందంటోన్న శృతి.. తనకు ఇలాంటి ఏకాంతం కొత్త కాదంటోంది. ఇప్పటికే 10 రోజుల స్వీయ నిర్బంధం పూర్తయిందని తెలిపిన శృతి.. ఈ 10 రోజుల్లో ఇంట్లో చాలా వంటలు చేశానని, ఆర్గానిక్ సబ్బులు కూడా తయారుచేశానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, కరోనా లక్షణాలు అస్సలు లేవని స్పష్టంచేసింది శృతిహాసన్.

First Published:  25 March 2020 6:44 AM GMT
Next Story