పుకార్లు ఖండించిన “గీతా”

గీతాఆర్ట్స్2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై 18 పేజెస్ అనే సినిమా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టిని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దాదాపు ఆమెను ఫిక్స్ చేశారు కూడా. ఇంతలోనే మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె పేరు అను ఎమ్మాన్యుయేల్.

కొన్నాళ్లుగా అవకాశాల్లేక ఇబ్బందిపడుతున్న అను ఎమ్మాన్యుయేల్ కు ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారంటూ కొన్ని వెబ్ సైట్స్ లో వార్తలు వచ్చాయి. వీటిని గీతాఆర్ట్స్2 సంస్థ కొట్టిపారేసింది. తమ లిస్ట్ లో అను ఎమ్మాన్యుయేల్ పేరు లేదని స్పష్టంచేసింది. ప్రస్తుతానికైతే కృతి శెట్టికే ఫిక్స్ అయ్యామని స్పష్టంచేసింది.

కరోనా కారణంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వాయిదాపడింది. అయినప్పటికీ యూనిట్ మాత్రం రెస్ట్ తీసుకోలేదు. దర్శకుడు సూర్యప్రతాప్, సంగీత దర్శకుడు గోపీసుందర్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ట్యూన్స్ పై కసరత్తు చేస్తున్నారు. ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటూనే ఆన్ లైన్ ద్వారా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుతున్నారు.