భీష్మ క్లోజింగ్ కలెక్షన్స్

హీరో నితిన్ కెరీర్ లో మరో హిట్ వచ్చి చేరింది. అదే భీష్మ సినిమా. ఓ వారం కిందట ఈ సినిమా ఫైనల్ రన్ ముగిసింది. నిజానికి మరో వారం రోజులు ఆడిద్దామనుకున్నప్పటికీ కరోనా కారణంగా థియేటర్లన్నీ మూసేశారు. అలా భీష్మ సినిమా రన్ కూడా ముగిసింది.

నిజానికి ఇది బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా. పండక్కో, సమ్మర్ కో వచ్చి ఉంటే పెద్ద హిట్ అయ్యేది. అటుఇటు కాకుండా అన్-సీజన్ లో రావడం వల్ల పెద్దగా వసూళ్లు రాలేదు. అందుకే ఇది నితిన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలవలేదు. కేవలం హిట్ రేంజ్ నుంచి సూపర్ హిట్ రేంజ్ కు మాత్రమే వెళ్లింది.

ఇక వసూళ్లు పరంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఫైనల్ రన్ తో 23 కోట్ల 5 లక్షల రూపాయల షేర్ వచ్చింది. రెవెన్యూ పర్సంటేజీ ప్రకారం చూసుకుంటే.. ఇది 110శాతంగా ఉంది. అటు ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా మిలియన్ మార్క్ అందుకోలేకపోయింది. 8 లక్షల 77వేల డాలర్ల వద్దే ఆగిపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో భీష్మ సినిమాకు వచ్చిన క్లోజింగ్ కలెక్షన్లు (షేర్స్) ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 9.15 కోట్లు
సీడెడ్ -రూ. 3.30 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.11 కోట్లు
ఈస్ట్ – రూ. 1.80 కోట్లు
వెస్ట్ – రూ. 1.34 కోట్లు
గుంటూరు – రూ. 1.91 కోట్లు
నెల్లూరు – రూ. 0.82 కోట్లు
కృష్ణా – రూ. 1.62 కోట్లు