Telugu Global
CRIME

కుమారుడి కరోనా విషయం దాచిన డీఎస్పీపై హత్యాయత్నం కేసు..!

లండన్ నుంచి వచ్చిన కొడుకు వివరాలను గోప్యంగా ఉంచడమే కాకుండా, కరోనా సోకిన అతడిని హోం క్వారంటైన్‌లో ఉంచకుండా బహిరంగ ప్రదేశాల్లో తిప్పిన పోలీసు అధికారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. కొత్తగూడెం డీఎస్పీ కొడుకు లండన్ నుంచి వచ్చాడు. అతడిని హోం క్వారంటైన్ చేయాలని ఎయిర్‌పోర్టు అధికారులు ముద్ర వేశారు. కానీ సదరు డీఎస్పీ అదేమీ పట్టించుకోకుండా అతడిని ఫంక్షన్లకు కుటుంబంతో సహా తిప్పాడు. తీరా అతడిలో కరోనా లక్షణాలు బయటపడటంతో కొత్తగూడెంలో కలకలం రేగింది. వెంటనే […]

కుమారుడి కరోనా విషయం దాచిన డీఎస్పీపై హత్యాయత్నం కేసు..!
X

లండన్ నుంచి వచ్చిన కొడుకు వివరాలను గోప్యంగా ఉంచడమే కాకుండా, కరోనా సోకిన అతడిని హోం క్వారంటైన్‌లో ఉంచకుండా బహిరంగ ప్రదేశాల్లో తిప్పిన పోలీసు అధికారిపై హత్యాయత్నం కేసు నమోదైంది.

కొత్తగూడెం డీఎస్పీ కొడుకు లండన్ నుంచి వచ్చాడు. అతడిని హోం క్వారంటైన్ చేయాలని ఎయిర్‌పోర్టు అధికారులు ముద్ర వేశారు. కానీ సదరు డీఎస్పీ అదేమీ పట్టించుకోకుండా అతడిని ఫంక్షన్లకు కుటుంబంతో సహా తిప్పాడు. తీరా అతడిలో కరోనా లక్షణాలు బయటపడటంతో కొత్తగూడెంలో కలకలం రేగింది.

వెంటనే డీఎస్పీ కొడుకుతో సహా కుటుంబాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అతని కొడుకు ఎక్కడెక్కడ తిరిగాడో అధికారులు వివరాలు సేకరించారు. పరీక్షల్లో కొడుకుతో సహా డీఎస్పీ, అతని వంట మనిషికి కరోనా సోకినట్లు నిర్థారించారు. కొడుకు వివరాలు గోప్యంగా ఉంచి అతడిని హోం క్వారంటైన్ చేయని డీఎస్పీపై జిల్లా డీఎంహెచ్‌వో పోలీసులకు పిర్యాదు చేశారు. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలతో ఎస్పీ భాస్కర్ నాయక్‌ను డీఎంహెచ్‌వో సునిల్ దత్ కలిశారు.

ఉద్దేశ్య పూర్వకంగానే కరోనా పాజిటీవ్ వ్యక్తిని బయట తిరిగేటట్లు చేసినందుకు గాను ఆ అధికారిపై హత్యాయత్నం చేసు నమోదు చేయాలని పిర్యాదు చేశారు. కాగా, ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదని ఎస్పీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే కేసు నమోదు చేస్తామని చెబుతున్నాయి.

First Published:  26 March 2020 1:40 AM GMT
Next Story