షాకింగ్… బిగ్ బాస్ బ్యూటీ మార్ఫింగ్ ఫొటోలు పోర్న్ సైట్లో ప్రత్యక్షం

సోషల్ మీడియాలో మంచి ఎంత ఉంటుందో.. అదే రేంజ్ లో చెడు కూడా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా కట్టడికి ఎలాంటి చర్యలు లేకపోవడంతో కొందరు కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతూ ఆర్థిక నష్టం చేస్తున్నారు. మరికొందరు సెలబ్రెటీల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ వారి నగ్న చిత్రాలను, ఫొన్ నెంబర్లను సోషల్ మీడియాలో పెడుతూ వారిని అభాసుపాలు చేస్తున్నారు.

తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీని ఇలానే చేశారు. తన ఫోటోలు మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్స్‌లో పెట్టారని తమిళ బిగ్ బాస్-3 బ్యూటీ మీరా మిథున్ వాపోయింది. పోర్న్ సెట్లో తన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంచారని ఆరోపిస్తోంది. దీనిపై తమిళనాడు పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తన ఫోటోలు, ఫోన్ నెంబర్లు పోర్న్ సైట్లో పెట్టిన వారిని వదిలేది లేదని మీరా మిథున్ హెచ్చరిస్తుంది. తనను డీఫేమ్ చేసేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది.

కాగా తమిళ బిగ్ బాస్ రియాలిటీ షో 3వ సీజన్ లో మీరా మిథున్ గ్లామర్ షోతో అదరగొట్టింది. అయితే మీరా మిథున్ వ్యవహారం ముందు నుంచి వివాదాస్పదమే. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్‌పై, ఆయన కూతురు అక్షర హాసన్ పై గతంలో సంచలన ఆరోపణలు చేసింది. 2016లో మిస్ ఇండియా సౌత్ కిరీటం దక్కించున్న ఆమె దాన్ని దుర్వినియగం చేయడంతో నిర్వాహకులు వెనక్కి తీసుకున్నారు. ఆమె మనీలాండరింగ్‌కు పాల్పడినట్లుగా తమిళ మీడియాలో ఆరోపణలు వచ్చాయి. అయితే తనను ఢీఫేమ్ చేసి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలేది లేదంటూ మీరా మిథున్ గట్టిగానే వార్నింగ్ ఇస్తోంది. చూడాలి మరీ మున్మందు ఏం జరుగుతుందో..!