Telugu Global
NEWS

కరోనా కోసం : పవన్ 2 కోట్లు... త్రివిక్రమ్ 20 లక్షల విరాళం

దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. పలు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై పోరాటానికి దాతలు విరాళాలు ఇవ్వాలని కోరింది. ఆసుపత్రుల్లో పరికరాలు, డాక్టర్లకు అవసరమైన కిట్స్ కొనడానికి ఈ విరాళాలు అవసరమవుతాయని చెబుతుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనకు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాన్ స్పందించారు. తన వంతు సాయంగా 2 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఒక కోటి […]

కరోనా కోసం : పవన్ 2 కోట్లు... త్రివిక్రమ్ 20 లక్షల విరాళం
X

దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. పలు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై పోరాటానికి దాతలు విరాళాలు ఇవ్వాలని కోరింది. ఆసుపత్రుల్లో పరికరాలు, డాక్టర్లకు అవసరమైన కిట్స్ కొనడానికి ఈ విరాళాలు అవసరమవుతాయని చెబుతుతోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనకు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాన్ స్పందించారు. తన వంతు సాయంగా 2 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఒక కోటి రూపాయలు ప్రధాన మంత్రి సహాయ నిధికి, ఏపీ సీఎం రిలీల్ ఫండ్‌కు 50 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల చొప్పున అందిస్తానని ట్విట్టర్‌లో చెప్పారు.

మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా కరోనాపై పోరాటానికి సాయం అందింస్తానని మాట ఇచ్చారు. తెలంగాణ, ఏపీలకు చెరి 10 లక్షల చొప్పున 20 లక్షలను సాయంగా ప్రకటించారు. త్వరలోనే ఈ చెక్ ఆయా రాష్ట్రాలకు అందిస్తానని చెప్పారు. కాగా, కరోనాపై పోరాటానికి చాలా మంది ప్రముఖులు, ఎంపీలు, వ్యాపార వేత్తలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. వీరితో పాటు సామాన్యులు కూడా 100 నుంచి 10వేల రూపాయల వరకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు డబ్బులు పంపిస్తున్నారు.

First Published:  26 March 2020 1:00 AM GMT
Next Story