Telugu Global
NEWS

జగన్ పాలసీ అమలుకు కేసీఆర్ యోచన

దేశంలో కరోనా వైరస్ ప్రబలకుండా ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నిత్యావసరాల కొరత, కూరగాయల సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిత్యావసరాల ధరలను నియంత్రించడానికి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. ఏపీలో నిత్యవసరాల ధరల పెరుగుదలపై, కృత్రిమ ధరల పెరుగుదల విషయంలో ప్రజలు ఫిర్యాదు చేయడానికి ఏపీ ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసింది. […]

జగన్ పాలసీ అమలుకు కేసీఆర్ యోచన
X

దేశంలో కరోనా వైరస్ ప్రబలకుండా ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నిత్యావసరాల కొరత, కూరగాయల సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిత్యావసరాల ధరలను నియంత్రించడానికి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది.

ఏపీలో నిత్యవసరాల ధరల పెరుగుదలపై, కృత్రిమ ధరల పెరుగుదల విషయంలో ప్రజలు ఫిర్యాదు చేయడానికి ఏపీ ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసింది. ఎవరైనా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మితే… 1092కు కాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. కరోనా లాక్ డౌన్ వేళ దోచుకునే వ్యాపారులను ఏపీ ప్రభుత్వం అణిచివేస్తోంది. వారిపై చర్యలకు రెడీ అవుతోంది.

సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా కిరాణా దుకాణాల్లో ధరలను పర్యవేక్షించడానికి రవాణా ప్రధాన కార్యదర్శి కృష్ణ బాబును నియమించారు. జిల్లాల కలెక్టర్లే అవసరమైన వస్తువుల రేట్లు ప్రకటించేలా చూడాలని ఆయన కోరారు. మార్కెట్లో కృత్రిమ కొరత లేకుండా వీళ్లు అమలు చేస్తున్నారు.

ఇప్పుడు నిత్యావసరాల ధరలు పెరుగుతున్న తెలంగాణలో ఏపీలో తీసుకుంటున్న చర్యలను అమలు చేయాలని కేసీఆర్ సర్కారు యోచిస్తోందట.

తెలంగాణలో నిత్యావసర వస్తువులను, కూరగాయలను బ్లాక్ మార్కెట్ కు తరలించి… ధరలను విపరీతంగా పెంచుతున్నారు. కేసీఆర్ హెచ్చరించినా వీళ్ళు వెనక్కి తగ్గడం లేదు. అధికారులు కూడా ఇదే నివేదించారు. దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలంగాణలో అమలు చేయాలని యోచిస్తున్నారట.. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

First Published:  26 March 2020 3:27 AM GMT
Next Story