Telugu Global
Cinema & Entertainment

కరోనాతో సెలబ్రిటీల కష్టాలు

కరోనా ఎఫెక్ట్ తో సామాన్యుల కష్టాల సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడీ వైరస్ మహమ్మారి సెలబ్రిటీలకు కూడా చుక్కలు చూపిస్తోంది. 10-12 మంది పనిమనుషులతో, ప్రతి పనికి ఓ అసిస్టెంట్ తో నిత్యం బిజీగా ఉండే తారలు.. ఇప్పుడు కరోనాతో కొత్త కష్టాలు అనుభవిస్తున్నారు. హీరోలు షాపింగ్ చేయడం మీరు చూశారా.. ఫస్ట్ టైమ్ బన్నీ షాపింగ్ చేశాడు. కరోనా కారణంగా తన ఇంటికి పని మనుషులు ఎవ్వరూ రాకపోవడంతో చేసేదేం లేక బన్నీ తన […]

కరోనాతో సెలబ్రిటీల కష్టాలు
X

కరోనా ఎఫెక్ట్ తో సామాన్యుల కష్టాల సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడీ వైరస్ మహమ్మారి సెలబ్రిటీలకు కూడా చుక్కలు చూపిస్తోంది. 10-12 మంది పనిమనుషులతో, ప్రతి పనికి ఓ అసిస్టెంట్ తో నిత్యం బిజీగా ఉండే తారలు.. ఇప్పుడు కరోనాతో కొత్త కష్టాలు అనుభవిస్తున్నారు.

హీరోలు షాపింగ్ చేయడం మీరు చూశారా.. ఫస్ట్ టైమ్ బన్నీ షాపింగ్ చేశాడు. కరోనా కారణంగా తన ఇంటికి పని మనుషులు ఎవ్వరూ రాకపోవడంతో చేసేదేం లేక బన్నీ తన ఇంటికి దగ్గరగా ఉన్న షాపింగ్ మాల్ కు వెళ్లాడు. ముఖానికి మాస్క్ వేసుకొని ఇంటికి కావాల్సిన సరుకులు కొన్నాడు.

బన్నీ ఇంట్లోనే కాదు.. చాలామంది హీరోలు, హీరోయిన్ల ఇళ్లకు పనిమనుషులు వెళ్లడం మానేశారు. ఎవరి ఇంట్లో వాళ్లు లాక్ డౌన్ లో ఉన్నారు. హీరోయిన్ కత్రినా అయితే ఇంట్లో గిన్నెలు తోముతోంది. తన గదిని తానే శుభ్రం చేసుకుంటోంది. చెల్లెలు, అమ్మకు తనే వండి పెడుతోంది. ఓ హీరోయిన్ లా కాకుండా.. సగటు అమ్మాయిలా అన్ని పనులు చేసుకుంటోంది.

అటు శృతిహాసన్, కరీనాకపూర్ లాంటి ప్రముఖులు కూడా ఇలాంటి కష్టాలే పడుతున్నారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. ముఖానికి మేకప్ కంటే ఇంట్లో పనులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

First Published:  27 March 2020 11:59 AM GMT
Next Story