Telugu Global
National

కరోనా కల్లోలం... దేశంలో ఎంత దారుణంగా ఉందో తెలుసా?

చైనాలోని వ్యూహాన్‌ లో సోకిన కరోనా(కోవిడ్-19) వైరస్ ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తోంది. క్రమంగా ఈ వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. ఇండియాలోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణకు 21రోజులు లాక్ డౌన్ అమలు చేస్తోంది. అయినప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా ఇండియాలో 722 కరోనా కేసులు నమోదుకాగా 16మంది మృతిచెందినట్లు సమాచారం. కరోనా పాజిటివ్ కేసుల్లో 47మంది విదేశీయులు ఉన్నారు. కరోనా మహమ్మారి దేశంలోని అన్ని రాష్ట్రాలకు పాకింది. […]

కరోనా కల్లోలం... దేశంలో ఎంత దారుణంగా ఉందో తెలుసా?
X

చైనాలోని వ్యూహాన్‌ లో సోకిన కరోనా(కోవిడ్-19) వైరస్ ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తోంది. క్రమంగా ఈ వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. ఇండియాలోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణకు 21రోజులు లాక్ డౌన్ అమలు చేస్తోంది. అయినప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా ఇండియాలో 722 కరోనా కేసులు నమోదుకాగా 16మంది మృతిచెందినట్లు సమాచారం. కరోనా పాజిటివ్ కేసుల్లో 47మంది విదేశీయులు ఉన్నారు.

కరోనా మహమ్మారి దేశంలోని అన్ని రాష్ట్రాలకు పాకింది. కరోనా కేసుల్లో కేరళ తొలిస్థానంలో నిలువడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఇప్పటివరకు 137కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక రెండో స్థానంలో దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్ర ఉంది. ఇక్కడ 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇలాగే మిగతా రాష్ట్రాలను చూసినట్లయితే వివరాలిలా ఉన్నాయి.

  • కేరళ-137
  • మహారాష్ట్ర 125, మరణాలు 3
  • కర్ణాటక 55, మరణాలు 3
  • తెలంగాణ 44
  • గుజరాత్ 43, మరణాలు 3
  • ఉత్తరప్రదేశ్ 42
  • రాజస్థాన్ 40
  • ఢిల్లీ 36, మరణాలు 1
  • హర్యానా 32
  • తమిళనాడు 29, మరణాలు 1
  • మధ్యప్రదేశ్ 20, మరణాలు 1
  • జమ్మూ, కశ్మీర్ 14, మరణాలు 1
  • లడక్ 13
  • ఆంధ్రప్రదేశ్ 11
  • పశ్చిమ బెంగాల్ 10, మరణాలు 1
  • బీహార్ 7, మరణాలు 1
  • చంఢీగడ్ 6
  • ఉత్తరాఖండ్ 6
  • గోవా 3
  • హిమాచల్ ప్రదేశ్ 3, మరణాలు 1
  • ఒడిశా 3
  • అండమాన్ నికోబార్ 1
  • మణిపూర్ 1
  • మిజోరం 1
  • పుదుచ్చేరి 1

అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా 5లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. చైనా, ఇటలీ, అమెరికా, యూకే దేశాలు కరోనా దాటికి విలవిలాడుతున్నాయి. కరోనాను చైనా కట్టడి చేస్తుండగా ఇటలీ, స్పెయిన్, యూకే, అమెరికా దేశాలు కట్టడి చేయడంలో విఫలమవుతున్నాయి.

కాగా భారత్ కరోనా కట్టడికి అన్నిరకాల చర్యలు చేపడుతుంది. అయినప్పటికీ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా మహమ్మారికి దూరంగా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతీఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి.

First Published:  27 March 2020 3:50 AM GMT
Next Story