Telugu Global
International

కరోనాతో పోరాటంలో పాక్ క్రికెటర్ల చేయూత

అంపైర్ అలీం ధార్ ఆహారం పంపిణీ ట్రస్ట్ ద్వారా షాహీద్ ఆఫ్రిదీ సేవ పాక్ క్రికెటర్ల విరాళం 50 లక్షలు కరోనా మహమ్మారి మన పొరుగుదేశం పాకిస్థాన్ ను సైతం విడిచిపెట్టలేదు. ఇప్పటికే పాకిస్థాన్ వ్యాప్తంగా వెయ్యికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు మరణాలు సైతం చోటు చేసుకొన్నాయి. వనరుల కొరత, పీకలోతు కష్టాలలో కూరుకుపోయిన పాకిస్థాన్ ప్రభుత్వం కరోనా వైరస్ ను నియంత్రించడానికి చేస్తున్న ప్రయత్నాలలో క్రికెట్ ప్రముఖులు సైతం తమవంతుగా ఉడతాసాయం […]

కరోనాతో పోరాటంలో పాక్ క్రికెటర్ల చేయూత
X
  • అంపైర్ అలీం ధార్ ఆహారం పంపిణీ
  • ట్రస్ట్ ద్వారా షాహీద్ ఆఫ్రిదీ సేవ
  • పాక్ క్రికెటర్ల విరాళం 50 లక్షలు

కరోనా మహమ్మారి మన పొరుగుదేశం పాకిస్థాన్ ను సైతం విడిచిపెట్టలేదు. ఇప్పటికే పాకిస్థాన్ వ్యాప్తంగా వెయ్యికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

పలు మరణాలు సైతం చోటు చేసుకొన్నాయి. వనరుల కొరత, పీకలోతు కష్టాలలో కూరుకుపోయిన పాకిస్థాన్ ప్రభుత్వం కరోనా వైరస్ ను నియంత్రించడానికి చేస్తున్న ప్రయత్నాలలో క్రికెట్ ప్రముఖులు సైతం తమవంతుగా ఉడతాసాయం చేస్తున్నారు.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కు కాంట్రాక్టు ఆటగాళ్లుగా ఉన్న ప్రధాన క్రికెటర్లంతా కలసి తమవంతుగా 50 లక్షల రూపాయల విరాళాన్ని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వానికి అందించారు.

అలీం ధార్ దాతృత్వం…

పాకిస్థాన్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన ఐసీసీ ప్యానెల్ అంపైర్ అలీం ధార్ లాహోర్ లోని తన రెస్టారెంట్ ద్వారా లాక్ డౌన్ దెబ్బతో… జీవనోపాథి కోల్పోయిన నిర్భాగ్యులకు ప్రతిరోజు ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తున్నాడు.

ధార్స్ డిలైట్ పేరుతో లాహోర్ లో అలీం ధార్ ఓ రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నాడు. ఐసీసీ ప్యానెల్ అంపైర్ గా 400 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అంపైర్ గా బాధ్యతలు నిర్వర్తించిన అలీం ధార్..తనవంతుగా ఉడతాసాయం చేస్తున్నట్లు ప్రకటించాడు.

పౌండేషన్ ద్వారా ఆఫ్రిదీ సేవ…

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహీద్ ఆఫ్రిదీ తనపేరుతో నిర్వహిస్తున్న ఫౌండేషన్ ద్వారా…లాక్ డౌన్ తో పనిలేకుండా ఉన్నవారికి పలువిధాలుగా సాయం చేస్తున్నాడు.

ప్రజలంతా విధిగా లాక్ డౌన్ పాటించాలని, ప్రభుత్వానికి చేయూతనివ్వాలని అలీం ధార్, షాహీద్ ఆఫ్రిదీ ప్రచారం చేస్తున్నారు.

First Published:  27 March 2020 6:31 AM GMT
Next Story