Telugu Global
National

డాక్టర్ల జంటకు కరోనా " 44కి చేరిన తెలంగాణ కేసులు

తెలంగాణలో కరోనా సెకండ్‌ స్టేజీకి చేరింది. ఇక్కడి పరిస్థితి అదుపు తప్పితే మూడో స్టేజీకి చేరే ప్రమాదం కన్పిస్తోంది. వీరితో కలిపి కరోనా పాజిటివ్‌ సంఖ్య 44కి చేరింది. గురువారం లేటెస్ట్‌గా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఇద్దరు డాక్టర్‌ దంపతులు. సికింద్రాబాద్‌ బౌద్ధనగర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా సోకింది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ల జంట ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. వీరికి కరోనా ఎలా సోకింది అనేది అంతు చిక్కడం లేదు. […]

డాక్టర్ల జంటకు కరోనా  44కి చేరిన తెలంగాణ కేసులు
X

తెలంగాణలో కరోనా సెకండ్‌ స్టేజీకి చేరింది. ఇక్కడి పరిస్థితి అదుపు తప్పితే మూడో స్టేజీకి చేరే ప్రమాదం కన్పిస్తోంది. వీరితో కలిపి కరోనా పాజిటివ్‌ సంఖ్య 44కి చేరింది. గురువారం లేటెస్ట్‌గా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఇద్దరు డాక్టర్‌ దంపతులు. సికింద్రాబాద్‌ బౌద్ధనగర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా సోకింది.

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ల జంట ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. వీరికి కరోనా ఎలా సోకింది అనేది అంతు చిక్కడం లేదు. ఈ మధ్య విమానంలో తిరుపతి వెళ్లి వచ్చిన డాక్టర్‌ వల్లే ఆయన భార్యకు కూడా కరోనా సోకిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దంప‌తులిద్దరూ డాక్టర్లే కావ‌డం కొంత ఆందోళ‌నకు కార‌ణ‌మ‌వుతోంది.

అయితే ఈ డాక్టర్ లు ఇద్దరూ ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడ తిరిగారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వారిని క్వారంటైన్‌లోకి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కొత్తగా నమోదైన మూడు క‌రోనా కేసులూ లోక‌ల్ ట్రాన్స్ మిష‌న్ ద్వారా వైర‌స్ బారిన‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురికీ విదేశీ ప్రయాణం చేసిన ట్రావెల్ హిస్టరీ లేదు. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికీ కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

First Published:  26 March 2020 10:05 PM GMT
Next Story