Telugu Global
NEWS

రాజకీయ నేతలకు కరోనా కష్టాలు !

కరోనా… రాజకీయ నేతలకు కొత్త కష్టాలు తీసుకొచ్చింది. ఇన్నాళ్లూ కాలికి బలపం కట్టినట్లు ఊరువాడా తిరిగిన నేతలు ఇప్పుడు ఇంట్లో కూర్చోలేక తెగ ఇబ్బందులు పడుతున్నారట. రాజకీయ నేతలు అంటేనే పొద్దునే తెల్ల షర్ట్‌..తెల్ల ప్యాంట్‌ వేసి బయటకు బయలుదేరేవారు. అవిఇవీ పనులు చూసుకుని రాత్రికి ఎప్పుడో ఇల్లు చేరుకునేవారు. కానీ ఇప్పుడు కొందరు నేతలకు పొద్దు పోవడం లేదట. అధికారంలో ఉన్న నాయకులు మొన్నటి దాకా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో […]

రాజకీయ నేతలకు కరోనా కష్టాలు !
X

కరోనా… రాజకీయ నేతలకు కొత్త కష్టాలు తీసుకొచ్చింది. ఇన్నాళ్లూ కాలికి బలపం కట్టినట్లు ఊరువాడా తిరిగిన నేతలు ఇప్పుడు ఇంట్లో కూర్చోలేక తెగ ఇబ్బందులు పడుతున్నారట. రాజకీయ నేతలు అంటేనే పొద్దునే తెల్ల షర్ట్‌..తెల్ల ప్యాంట్‌ వేసి బయటకు బయలుదేరేవారు. అవిఇవీ పనులు చూసుకుని రాత్రికి ఎప్పుడో ఇల్లు చేరుకునేవారు. కానీ ఇప్పుడు కొందరు నేతలకు పొద్దు పోవడం లేదట.

అధికారంలో ఉన్న నాయకులు మొన్నటి దాకా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో కొందరు రోడ్లమీదకు వచ్చారు. కరోనా నివారణ చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. పోలీసులతో కలిసి సమన్వయం చేశారు.
ఆ తర్వాత మళ్లీ ఇళ్లకు జారుకున్నారు.

పరిస్థితి చూస్తే…బయటకు వెళితే జనం వచ్చి కలుస్తారు. ఎవరు వైరస్ తీసుకొచ్చి తగిలిస్తారో అనే భయం నేతల్లో ఉంది. దీంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. కొందరు టీవీలు చూసి టైమ్‌ పాస్‌ చేస్తే….మరికొందరు ఫోన్ లలో సినిమాలు, ఇతరులతో మాట్లాడుతూ వ్యవహారాలు చక్కబెడుతున్నారట.

ఇక ప్రతిపక్ష నేతల బాధలు వేరు. వారిని పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు. దీంతో కొందరు ఫామ్‌హౌస్‌లకు వెళ్లారు. అక్కడే ఉంటున్నారు. ఇంకొందరు ఇళ్లలో పుస్తకాలు చదువుతున్నారు. మరొ కొందరు వంటలు చేస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరు తమకు అలవాటైన యూట్యూబ్‌లో గంటలు గంటలు లైవ్‌లోకి వచ్చి కరోనా సందేశాలు ఇస్తున్నారు.

మొత్తానికి కరోనా… రాజకీయ నేతలకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఇంట్లో పట్టుమని పది నిమిషాలు ఉండని నేతలు…ఇప్పుడు లాక్‌డౌన్‌ కావడంతో కుటుంబ సభ్యులు సంబరపడిపోతున్నారట.

First Published:  27 March 2020 10:33 PM GMT
Next Story