పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

కరోనా ప్రభావంతో ఆల్రెడీ అనుకున్న పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. పెళ్లయి విడాకులు తీసుకున్న హృతిక్-సుజేన్ లాంటి వాళ్లు కలుసుకుంటున్నారు. ఇక పెళ్లికి సిద్ధమైన జంటల పరిస్థితి ఏంటి? ఈ కేటగిరీలోకే వస్తుంది హీరోయిన్ కృతి కర్బందా. తెలుగులో తీన్ మార్, బ్రూస్ లీ లాంటి సినిమాలు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్ తో ఈమె పీకల్లోతు ప్రేమలో ఉంది. తన ప్రేమ వ్యవహారాన్ని కిందటి ఏడాదే ఈమె బయటపెట్టింది. దీంతో ఈ ఏడాది వీళ్లు పెళ్లి చేసుకుంటారని మీడియా భావించింది. అయితే అందరికీ ఓ చిన్నపాటి షాకిచ్చింది కృతి కర్బందా.

పెళ్లి చేసుకోవడం కంటే తామిద్దరం ప్రేమించుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామంటోంది కృతి. అంటే దానర్థం ఇప్పట్లో పెళ్లి చేసుకోరట. అలా అని 2021 అని కూడా ఈమె చెప్పడం లేదు. కొన్నేళ్ల పాటు ఇలానే ప్రేమించుకుంటారట. పెళ్లికి మానసికంగా సిద్ధమైన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటారట. ఈలోగా వీళ్లు విడిపోకుండా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే బాలీవుడ్ లో అంతే. చాలా డేటింగ్ లు పెళ్లిపీటల వరకు వెళ్లవు. ముద్దుముచ్చట్లతోనే ఆగిపోతాయి. ఈ జంటది అలా కాకూడదని కోరుకుందాం.