ఆర్ఆర్ఆర్ పై మరో పుకారు

గతంలో బాహుబలిపై ఎన్ని పుకార్లు వచ్చాయో చూశాం. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారనే పుకారు కూడా అప్పట్లో వచ్చింది. ఇలా వాస్తవాల కంటే పుకార్లే బాహుబలి సినిమాను ఎక్కువగా లైమ్ లైట్లో నిలబెట్టాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వంతు వచ్చింది.

బాహుబలి తర్వాత తిరిగి ఆ స్థాయిలో పుకార్లు ఈ సినిమాకే చూస్తున్నాం. కనీసం వారం గ్యాప్ లో ఏదో ఒక పుకారు ఈ సినిమాకు సంబంధించి వస్తూనే ఉంటుంది. తాజాగా మరో గాసిప్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషించబోతున్నాడనేది ఆ పుకారు సారాంశం.

నమ్మేలా అనిపించకపోయినా లాజికల్ గా ఆలోచిస్తే ఈ పుకారును కొంత నమ్మొచ్చు. ఎందుకంటే.. విజయ్ ఎంత పెద్ద హీరో అయినప్పటికీ సరైన వ్యక్తి వచ్చి అడిగితే గెస్ట్ రోల్ చేయడానికి నో చెప్పడు. గతంలో తనకు సూపర్ హిట్స్ ఇచ్చిన ప్రభుదేవా అడిగాడు కాబట్టి, హిందీలో రౌడీరాథోడ్ అనే సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు.

సో.. ఈసారి కూడా రాజమౌళి లాంటి వ్యక్తి రంగంలోకి దిగి విజయ్ ను సంప్రదిస్తే పనైపోతుంది. కాకపోతే విజయ్ గెస్ట్ రోల్ అవసరమా అనేది ఆలోచించుకోవాలి. కేవలం కోలీవుడ్ మార్కెట్ వరకైతే విజయ్ గెస్ట్ రోల్ పనికొస్తుంది. ఆ మాత్రం దానికి విజయ్ కు భారీగా ముట్టజెప్పాలి. కోలీవుడ్ స్టార్స్ లేకుండానే బాహుబలి, బాహుబలి-2 సినిమాలు కోలీవుడ్ లో ఘనవిజయం సాధించాయి. కాబట్టి ఆర్ఆర్ఆర్ కు విజయ్ అవసరం ఉండకపోవచ్చని మరో వర్గం వాదిస్తోంది. ఏదేమైనా “ఆర్ఆర్ఆర్ లో విజయ్” అనే టాపిక్ పై ప్రస్తుతం హాట్ హాట్ చర్చ నడుస్తోంది.