Telugu Global
NEWS

భరోసా కల్పిస్తూనే హెచ్చరికలు.... ఇది కేసీఆర్ స్టైల్ ప్రెస్ మీట్

ఇదే మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లోని గొప్పదనం. కొవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో.. ఆయన ఆదివారం ఉన్నతాధికారులతో రివ్యూ చేశాక.. మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. నవరసనటనా సార్వభౌములను కూడా మైమరపించేలా వన్ మ్యాన్ షో చేసేశారు. జనానికి భరోసా కల్పిస్తూనే బెదిరింపు వచనాలు చేశారు. అలా బెదిరిస్తూ ఆ వెంటనే ఊరడించారు. అలా ఊరడిస్తూనే మళ్లీ కట్టడి చేసేందుకు యత్నించారు. చివరాఖరికి.. జనాన్ని మాత్రం మరోసారి సాటిస్ఫై చేసి.. మనసులు గెలుచుకున్నారు. ఎందుకంటే.. […]

భరోసా కల్పిస్తూనే హెచ్చరికలు.... ఇది కేసీఆర్ స్టైల్ ప్రెస్ మీట్
X

ఇదే మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లోని గొప్పదనం. కొవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో.. ఆయన ఆదివారం ఉన్నతాధికారులతో రివ్యూ చేశాక.. మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. నవరసనటనా సార్వభౌములను కూడా మైమరపించేలా వన్ మ్యాన్ షో చేసేశారు. జనానికి భరోసా కల్పిస్తూనే బెదిరింపు వచనాలు చేశారు. అలా బెదిరిస్తూ ఆ వెంటనే ఊరడించారు. అలా ఊరడిస్తూనే మళ్లీ కట్టడి చేసేందుకు యత్నించారు. చివరాఖరికి.. జనాన్ని మాత్రం మరోసారి సాటిస్ఫై చేసి.. మనసులు గెలుచుకున్నారు.

ఎందుకంటే.. కరోనా భయంతో దేశమంతా వణుకుతున్న వేళ.. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఓ ఆశాజనకమైన ప్రకటన చేశారు. ఆదివారం కేవలం 2 పాజిటివ్ కేసులే నమోదయ్యాయని.. పరిస్థితులు అనుకూలిస్తే ఏప్రిల్ 7 నాటికి కరోనా రహిత తెలంగాణను సాధించవచ్చని చెప్పారు. కానీ.. అందుకు ప్రజల సహకారం మరింత అవసరం అన్న వాస్తవాన్ని కాస్త గట్టిగానే నొక్కి చెప్పారాయన. అంతే కాదు. ఆర్థికంగా ఎంత కష్టమైనా భరించి ప్రతి వరి, మొక్కజొన్న గింజనూ కొనుగోలు చేసి…. రైతును ఆదుకుంటామన్నారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు తెలంగాణలో ఉంటే.. కుటుంబసభ్యుల్లా కడుపులో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారు. అందరి ఆకలి తీరుస్తామని.. అందరికీ వసతి కల్పిస్తామని భరోసా కల్పించారు. కరోనా పీడితులను ఆరోగ్యవంతులని చేని… వారి ఇంటికి పంపించేందుకు కృత నిశ్చయంతో ఉన్న విషయాన్ని తన మాటలతో వ్యక్తీకరించారు.

ఇదే సమయంలో… సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేసే వారిని మాత్రం క్షమించేది లేదని… అంతకు వంద రెట్లు శిక్ష అనుభవిస్తారని… శిక్ష అంటే ఎట్లా ఉంటదో తాను చూపిస్తానని ప్రకటన చేసి… సరికొత్త చర్చకు తెర తీశారు.

ఓవరాల్ గా కన్ క్లూడ్ చేసేది ఏంటంటే… ఏప్రిల్ 7లోగా తెలంగాణ నుంచి కరోనా వెళ్లిపోతుందని చెప్పిన మాటను.. అంతా స్వాగతించాల్సిందే. ప్రజల్లో ఆయన కల్పించిన భరోసాకు శభాష్ అనాల్సిందే.

First Published:  29 March 2020 11:38 PM GMT
Next Story