పెళ్లిపై ప్రకటన చేసిన నితిన్

భీష్మ సినిమా ఇలా రిలీజైన వెంటనే అలా పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాడు నితిన్. అదే గ్యాప్ లో తన లవర్ షాలినీతో అతడికి ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. అయితే అంతలోనే అనుకోని అవాంతరం. ప్రపంచ దేశాల్ని వణికించిన కరోనా ఇండియాలోకి కూడా ఎంటరవ్వడం, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.

నితిన్ ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది. దీంతో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. దాన్ని యథాతథంగా అందిస్తున్నాం.

“నా అభిమానుల‌కు, తెలుగు ప్ర‌జ‌ల‌కు న‌మ‌స్కారం. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాలతో స‌హా దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డివున్నాయో మీకు తెలుసు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్దు. అందుకే నా పుట్టిన‌రోజును జ‌రుపుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాను. అంతే కాదు, లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఏప్రిల్ 16వ తేదీ జ‌ర‌గాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మ‌నమంద‌రం క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి క‌లిసిక‌ట్టుగా పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ సంక్షోభ స‌మ‌యంలో మ‌న ఇళ్ల‌ల్లో మ‌నం కాలు మీద కాలేసుకొని కూర్చొని, మ‌న కుటుంబంతో గ‌డుపుతూ బ‌య‌ట‌కు రాకుండా ఉండ‌ట‌మే దేశానికి సేవ చేసిన‌ట్లు. ఎల్ల‌వేళ‌లా మీ అభిమానంతో పాటు మీ ఆరోగ్యాన్నీ ఆశించే మీ.. నితిన్‌..”.