కరోనా టైమ్ లో కొత్త రిలీజ్ డేట్

ఈ కరోనా టైమ్ లో దేశంతో పాటు టాలీవుడ్ అంతా లాక్ డౌన్ అయింది. సినిమావాళ్లంతా తమ సినిమాల్ని వాయిదా వేసుకుంటున్న ఈ టైమ్ లో, మంచు విష్ణు మాత్రం రివర్స్ లో తన సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాడు. అవును.. తను చేస్తున్న మోసగాళ్లు సినిమాకు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేశాడు ఈ మంచు హీరో.

లాక్‌డౌన్‌తో చిత్రంలో కీల‌క‌మైన ఐటీ ఆఫీస్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ నిలిచిపోయింది. అయిన‌ప్ప‌టికీ, విష్ణుతో పాటు కాజ‌ల్ అగ‌ర్వాల్ పాల్గొన్న స‌న్నివేశాలు, బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సునీల్‌శెట్టితో క‌లిసి చేసిన క్లైమాక్స్ యాక్ష‌న్ సీన్ల‌తో పాటు అధిక శాతం షూటింగ్ పూర్త‌యింది. తాజాగా ‘మోస‌గాళ్లు’ చిత్రం విడుద‌ల తేదీని మంచు విష్ణు ప్ర‌క‌టించారు. తెలుగు వెర్ష‌న్‌ను జూన్ 5వ తేదీ, ఇంగ్లీష్ వెర్ష‌న్‌ను జూలైలో విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఇటీవ‌ల ‘మోస‌గాళ్లు’ చిత్రానికి సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్లకు ప్రేక్ష‌కులు, అభిమానుల‌ నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. ఆ పోస్ట‌ర్ల‌లో అర్జున్‌గా విష్ణు, అను పాత్ర‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ఏసీపీ కుమార్‌గా సునీల్ శెట్టి క‌నిపించి ఆక‌ట్టుకున్నారు.