మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది

టాలీవుడ్ లో ఇప్పుడంతా రష్మిక మేనియా కొనసాగుతోంది. ఆమె సినిమా చేస్తే అది సూపర్ హిట్ అనే టాక్ గట్టిగా నడుస్తోంది. మొన్నటికిమొన్న సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేస్తే అది కాస్తా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఆ తర్వాత భీష్మ చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. అందుకే రష్మిక కోసం స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మరో క్రేజీ ఆఫర్ అందుకుంది ఈ కన్నడ కస్తూరి.

త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఆ మూవీ కంప్లీట్ అయిన వెంటనే హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేస్తాడు. ఇందులో హీరోయిన్ గా రష్మిక సెలక్ట్ అయింది. ఈ మేరకు నిర్మాత చినబాబు నుంచి ఆమెకు అడ్వాన్స్ చెక్ అందినట్టు టాక్.

ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ సినిమాతో బిజీగా ఉంది రష్మిక. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో తన పాత్ర కోసం ఆమె హోం వర్క్ చేస్తోంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తుంది. ఈ గ్యాప్ లో ఓ తమిళ సినిమా కూడా పూర్తిచేసే ప్లాన్ లో ఉంది రష్మిక.