ఆ ప్రార్థనలకు వెళితే వెంటనే చెప్పండి… తెలంగాణ సర్కార్‌ వినతి !

తెలంగాణలో కరోనా వైరస్‌ల సంఖ్య అరవై దాటింది. దీంతో ప్రభుత్వం అలర్ట్‌ అయింది. ఢిల్లీలో ఈ నెల 13 నుంచి 15 వరకు నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. ఇద్దరు గాంధి ఆసుపత్రిలో, ఒకరు అపోలో ఆసుపత్రిలో, ఒకరు గ్లోబల్ ఆసుపత్రిలో, ఒకరు నిజామాబాద్ లో, ఒకరు గద్వాలలో మరణించారు. వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నారు.

మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తున్నది కాబట్టి, ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్నది. వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. కాబట్టి మర్కజ్ వెళ్ళి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలి. వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియచేయాలని వైద్య ఆరోగ్య శాఖ కోరుతున్నది.

ఏపీలో కూడా ఈ ప్రార్థనలకు వెళ్లిన వారికి వైరస్‌ సోకినట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రార్థనలకు ఎవరెవరు వెళ్లారు అన్నదానిపై అక్కడి ప్రభుత్వం కూడా వివరాలు సేకరిస్తోంది. ఎవరైనా ప్రార్థనలకు వెళితే ముందే వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరుతోంది.

మొత్తానికి తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా ఈ ప్రార్థనలకు వెళ్లిన వారే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కరీంనగర్‌లో బయటపడ్డ కేసులు కూడా ఇండోనేషియా నుంచి ప్రార్థనలకు వచ్చినవారే అంటించారు. మొత్తం మీద ఈకేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ఈ ప్రార్థనలకు వెళ్లిన వారి కోసం ప్రభుత్వం సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది.

ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి…

Publiée par Telangana CMO sur Lundi 30 mars 2020