Telugu Global
International

కరోనా కల్లోలం... కాస్తంత మంచి ప్రభావం

నాణేనికి బొమ్మా బొరుసూ రెండు వైపులూ ఉన్నట్టుగానే.. కరోనా ప్రభావంతో చెడు ఎంత జరుగుతుందో.. ఆ స్థాయిలో కాకున్నా కాస్తంత చెప్పుకోదగ్గ పరిణామంలోనే మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా.. ఇళ్లకే పరిమితం అవుతున్న ప్రజలు.. ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. కుటుంబీకులతో నిత్యం మాట్లాడుతున్నారు. అనుబంధాలు పెంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ.. సమయానికి ఆహారం తీసుకుంటూ.. సమయానికి నిద్రపోతూ.. తమ పిల్లల పర్యవేక్షణను తామే వ్యక్తిగతంగా చూసుకోగలుగుతున్నారు. అత్యవసర […]

కరోనా కల్లోలం... కాస్తంత మంచి ప్రభావం
X

నాణేనికి బొమ్మా బొరుసూ రెండు వైపులూ ఉన్నట్టుగానే.. కరోనా ప్రభావంతో చెడు ఎంత జరుగుతుందో.. ఆ స్థాయిలో కాకున్నా కాస్తంత చెప్పుకోదగ్గ పరిణామంలోనే మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా.. ఇళ్లకే పరిమితం అవుతున్న ప్రజలు.. ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. కుటుంబీకులతో నిత్యం మాట్లాడుతున్నారు. అనుబంధాలు పెంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ.. సమయానికి ఆహారం తీసుకుంటూ.. సమయానికి నిద్రపోతూ.. తమ పిల్లల పర్యవేక్షణను తామే వ్యక్తిగతంగా చూసుకోగలుగుతున్నారు. అత్యవసర విధుల్లో ఉన్న వారిని మినహాయిస్తే.. దాదాపుగా 90 శాతం రంగాల ప్రజలు.. చాలా రోజుల తర్వాత ఉరుకుల పరుగుల జీవితానికి దూరంగా ఉంటున్నారు. కరోనాపై అవగాహన ఉన్న వారైతే… అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ… సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

మరికొందరు ఔత్సాహికులు… ఆన్ లైన్ వీడియోల ద్వారా తమకు నచ్చిన కోర్సులు నేర్చుకుంటూ.. కొత్త విషయాలు తెలుసుకుంటూ నైపుణ్యాలు పెంచుకుంటున్నారు. వీటికి మించిన విషయం ఏంటంటే.. ఢిల్లీ లాంటి చోట్ల కరోనా ఓ వైపు విలయ తాండవం చేస్తూనే.. మరో వైపు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు పరోక్షంగా కారణమవుతోంది. కరోనా లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో.. ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రాకపోవడం.. పరిశ్రమలన్నీ మూతపడిన పరిస్థితుల్లో.. గాలి కాలుష్యం దాదాపుగా తగ్గిపోవడం.. ఢిల్లీ వాసులనే ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటిస్తూ.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటే.. కరోనాను దూరం చేయవచ్చు. ఇలాంటి మంచి ఫలితాలను ముందు ముందు కొనసాగించవచ్చు.

First Published:  1 April 2020 8:00 AM GMT
Next Story