అలాంటిదేం లేదంటున్న పూజా హెగ్డే

పూజాహెగ్డే మరోసారి తమిళ్ లోకి వెళ్లబోతోంది. హరి దర్శకత్వంలో హీరో సూర్య సరసన నటించబోతోంది. ఈ మేరకు చాలా సైట్స్ లో న్యూస్ వచ్చేసింది. ఈ హంగామా అంతా అయిపోయిన తర్వాత తాపీగా ఈ మేటర్ పై క్లారిటీ ఇచ్చింది పూజా హెగ్డే. అప్పుడే అంతా కన్ ఫర్మ్ అయిపోలేదంటోంది ఈ బుట్టబొమ్మ.

“హలో..హలో.. తమిళ సినిమాలు చేస్తున్నానని అప్పుడే కంక్లూజన్ కు వచ్చేయకండి. ఇప్పటివరకైతే ఏ తమిళ సినిమాకు సైన్ చేయలేదు. ప్రస్తుతానికి రెండు కథలు మాత్రం విన్నానంతే. అయితే అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది తమిళ సినిమా చేస్తాను.”

ఇలా తన కోలీవుడ్ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది పూజాహెగ్డే. ఆమె ఇలా ట్వీట్ చేయడం వెనక ఓ బలమైన కారణం ఉంది. అగ్రిమెంట్ అవ్వకుండా ఇలా ముందే మేటర్ బయటకొచ్చేస్తే.. దర్శక-నిర్మాతలకు కోపం రావొచ్చు. పైగా ఆ ప్రాజెక్టు ఆఖరి నిమిషంలో చేజారితే తిరిగి మళ్లీ అదో న్యూస్ అవుతుంది. అందుకే పూజా హెగ్డే ఇలా ముందు జాగ్రత్తగా వ్యవహరించింది. ప్రస్తుతానికి ఏ సినిమాకు సైన్ చేయలేదని స్పష్టంచేసింది.