Telugu Global
National

చీకటి ఖండాన్నీ తాకిన కరోనా వైరస్

వైరస్ దెబ్బతో సెనెగల్ సాకర్ దిగ్గజం మృతి గత కొద్దివారాలుగా ధనికదేశాలను మాత్రమే గడగడలాడిస్తూ వచ్చిన కరోనా మహమ్మారి… చీకటి ఖండం ఆఫ్రికాలోకి సైతం ప్రవేశించింది. మిగిలిన ఖండాలతో పోల్చి చూస్తే… నిరుపేదలైన ఆఫ్రికా ఖండ దేశాల ప్రజలు మాత్రమే… కరోనా వైరస్ భయం లేకుండా నిశ్చింతగా గడుపుతూ వచ్చారు. అయితే…పశ్చిమాఫ్రికా దేశం సెనెగల్ లో..కరోనా వైరస్ ప్రవేశించడమే కాదు…సాకర్ మాజీ గ్రేట్, మార్సెలీ క్లబ్ అధ్యక్షుడు పాపే డియోఫ్ ప్రాణాలను బలితీసుకొంది. కరోనా వైరస్ సోకడమే […]

చీకటి ఖండాన్నీ తాకిన కరోనా వైరస్
X
  • వైరస్ దెబ్బతో సెనెగల్ సాకర్ దిగ్గజం మృతి

గత కొద్దివారాలుగా ధనికదేశాలను మాత్రమే గడగడలాడిస్తూ వచ్చిన కరోనా మహమ్మారి… చీకటి ఖండం ఆఫ్రికాలోకి సైతం ప్రవేశించింది. మిగిలిన ఖండాలతో పోల్చి చూస్తే… నిరుపేదలైన ఆఫ్రికా ఖండ దేశాల ప్రజలు మాత్రమే… కరోనా వైరస్ భయం లేకుండా నిశ్చింతగా గడుపుతూ వచ్చారు.

అయితే…పశ్చిమాఫ్రికా దేశం సెనెగల్ లో..కరోనా వైరస్ ప్రవేశించడమే కాదు…సాకర్ మాజీ గ్రేట్, మార్సెలీ క్లబ్ అధ్యక్షుడు పాపే డియోఫ్ ప్రాణాలను బలితీసుకొంది.

కరోనా వైరస్ సోకడమే కాదు…దానితో పోరాడలేక పాపే కన్నుమూసినట్లు సెనెగల్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు…పాపే కేవలం కరోనా వైరస్ కారణంగానే మృతి చెందినట్లు గ్రహించిన ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.

రాజధాని డకార్ లో చికిత్సపొందుతూ 68 సంవత్సరాల పాపే మరణించడంతో… సెనెగల్ లో విషాదం ఆవరించింది. యూరోప్ లోని ఓ విఖ్యాత సాకర్ క్లబ్ కు… అధ్యక్షుడి స్థాయికి ఎదిగిన నల్లజాతి తొలి విఖ్యాత ప్లేయర్ పాపే డియోప్ మాత్రమే కావడం విశేషం.

ఫ్రెంచ్ మాజీ వలసదేశంగా ఉన్న సెనెగల్ లో మొత్తం 190 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా..పాపే మృతిని తొలిమరణంగా నమోదు చేశారు.

ఆటగాడిగా, సాకర్ నిర్వాహకుడిగా, ఓ ప్రపంచస్థాయి క్లబ్ కు అధ్యక్షుడుగా సమర్థవంతమైన సేవలు అందించిన పాపేను కోల్పోడం తమదేశ దురదృష్టమని అధ్యక్షుడు మాకే సాల్ విచారం వ్యక్తం చేశారు.

First Published:  2 April 2020 9:23 AM GMT
Next Story