బాహుబలిని క్రాస్ చేసిన మహేష్ మూవీ

మొన్న సంక్రాంతికి మహేష్-బన్నీ పోటీపడ్డారు. మహేష్ నుంచి సరిలేరు నీకెవ్వరు, బన్నీ నుంచి అల వైకుంఠపురములో సినిమాలు వచ్చాయి. ఈ రెండింటి టార్గెట్ ఒకటే. బాహుబలి రికార్డుని బద్దలుకొట్టాలి. ఈ దిశగా మహేష్ మూవీ ఫెయిల్ అవ్వగా, బన్నీ చేసిన అల వైకుంఠపురములో మూవీ దరిదాపుల వరకు వెళ్లి ఆగిపోయింది.

సంక్రాంతికి నడిచిన ఈ ప్రహసనాన్ని పక్కనపెడితే.. ఇప్పుడు మహేష్ మూవీ నిజంగానే బాహుబలి-2ను క్రాస్ చేసింది. అయితే సిల్వర్ స్క్రీన్ పై కాదు, బుల్లితెరపై బాహుబలి-2ను సరిలేరు నీకెవ్వరు సినిమా అధిగమించింది. ఉగాది కానుకగా జెమినీ టీవీలో ప్రసారమైన ఈ సినిమాకు అత్యథికంగా 23.35 టీఆర్పీ వచ్చింది. గతంలో బాహుబలి-2కు వచ్చిన రేటింగ్ (21.7) కంటే ఇది ఎక్కువ.

నిజానికి టీవీలో ప్రసారం కంటే ముందే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లోకి వచ్చేసింది. దీంతో అన్ని సినిమాల్లానే దీనికి కూడా రేటింగ్ తగ్గుతుందని భావించారు. కానీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ.. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో సరిలేరు నీకెవ్వరు సినిమాకు భారీ రేటింగ్ వచ్చింది. అలా మహేష్ మూవీకి లాక్ డౌన్ కలిసొచ్చిందన్నమాట.