ఎట్టకేలకు దిగొచ్చిన బాలయ్య…

చిరంజీవి విరాళం ప్రకటించాడు. నాగార్జున విరాళం ఇవ్వడమే కాకుండా కరోనా సాంగ్ కూడా పాడాడు. వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి విరాళం ఇచ్చాడు. ఇలా సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోస్ అంతా ముందుకొచ్చి కరోనాను ఎదుర్కొనేందుకు విరాళాలు ఇస్తుంటే.. బాలయ్య మాత్రం సైలెంట్ అయిపోయాడు. దీనిపై వరుసగా కథనాలు కూడా వచ్చాయి.

ప్రపంచాన్ని ఓవైపు కరోనా వణికిస్తుంటే బాలయ్య మాత్రం ఏమీ పట్టనట్టు ఉన్నారంటూ కొన్ని సైట్లు అతడ్ని ఏకి పడేశాయి. ఇవన్నీ బాలయ్య చెవికి చేరాయోమో.. ఎట్టకేలకు ముందుకొచ్చాడు ఈ నందమూరి హీరో. తెలుగు రాష్ట్రాలకు విరాళం అందించడంతో పాటు సీసీసీకి కూడా విరాళం ఇచ్చాడు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు బాలయ్య. దీంతో పాటు ఉపాధి లేక ఇబ్బందిపడుతున్న సినీకార్మికుల సంక్షేమం కోసం మరో 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించాడు. కార్తికేయ లాంటి చిన్న హీరో కూడా తనవంతుగా సహాయం చేయగా.. ఇన్నాళ్లకు బాలయ్య లాంటి పెద్ద హీరో బయటకొచ్చి విరాళం ఇచ్చాడు. ఇదే విరాళం ట్రోలింగ్ జరగకముందే ఇచ్చి ఉంటే పరువైనా నిలిచేదంటూ సోషల్ మీడియాలో అతడిపై కామెంట్స్ పడుతున్నాయి.