Telugu Global
NEWS

వైద్య సేవలను ఎస్మా పరిధిలోకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం

కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. రాష్ట్రంలో అత్యవసర సేవల చట్టం (ఎస్మా)ని తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాబోయే 6 నెలల పాటు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది అందరూ ఎస్మా పరిధిలోనికి రానున్నారు. ఈ మేరకు శుక్రవారం జీవో జారీ చేసింది. ఏపీలో గత మూడు రోజుల్లో కోవిడ్-19 బాధితుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. దీనికి కారణం ఢిల్లీలోని […]

వైద్య సేవలను ఎస్మా పరిధిలోకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం
X

కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. రాష్ట్రంలో అత్యవసర సేవల చట్టం (ఎస్మా)ని తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాబోయే 6 నెలల పాటు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది అందరూ ఎస్మా పరిధిలోనికి రానున్నారు. ఈ మేరకు శుక్రవారం జీవో జారీ చేసింది.

ఏపీలో గత మూడు రోజుల్లో కోవిడ్-19 బాధితుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. దీనికి కారణం ఢిల్లీలోని మర్కజ్ సమ్మేళనానికి వెళ్లిన యాత్రికులే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇప్పటికే దాదాపు మర్కజ్ యాత్రికులను గుర్తించినా.. సెకెండ్ కాంటాక్ట్‌లో ఉన్న వారిని క్వారంటైన్‌లో ఉంచారు. రాబోయే రోజుల్లో మరెంత మంది పాజిటీవ్‌గా తేలుతారనే అనుమానాలు ఉన్నాయి.

ఇప్పటికే వైద్య విభాగానికి చెందిన సిబ్బంది కొరత వెంటాడుతోంది. దీంతో ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఈ చట్టం ప్రకారం.. ఆరోగ్య సిబ్బంది ఎవరైనా పని చేసేందుకు నిరాకరిస్తే వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

వైద్య, పారిశుథ్య సిబ్బంది, వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణా సిబ్బంది, మంచినీళ్లు, విద్యుత్ సరఫా, భద్రతా సిబ్బంది, ఆహార సరఫరా, బయో మెడికల్ వ్యర్థాల తరలింపు, మందుల కొనుగోలు, రవాణా, తయారీ, అంబులెన్స్ సర్వీసులు కూడా ఎస్మా పరిధిలోనికి రానున్నాయి.

First Published:  3 April 2020 8:27 AM GMT
Next Story