Telugu Global
NEWS

పేదలకు రూ. వెయ్యి సహాయం.... పంపిణీకి సర్వం సిద్ధం

ఉచితంగా రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా.. ప్రతి రేషన్ కార్డు దారుడికీ ఉచితంగా బియ్యం, కందిపప్పు ఇతర సరుకులను అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పెన్షన్లనూ అదే రీతిలో ఇంటింటికీ పంపిణీ చేసింది. కరోనా లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉన్న నేపథ్యంలో… ప్రజల వద్దకే సేవలు అమలు చేసిన తర్వాత… మరో కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసింది. ఆదాయ మార్గాలు మూసుకుపోయిన ఈ పరిస్థితుల్లో.. ప్రతి బియ్యం కార్డు దారులకు వెయ్యి రూపాయల చొప్పన సహాయాన్ని అందించనుంది. […]

పేదలకు రూ. వెయ్యి సహాయం.... పంపిణీకి సర్వం సిద్ధం
X

ఉచితంగా రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా.. ప్రతి రేషన్ కార్డు దారుడికీ ఉచితంగా బియ్యం, కందిపప్పు ఇతర సరుకులను అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పెన్షన్లనూ అదే రీతిలో ఇంటింటికీ పంపిణీ చేసింది.

కరోనా లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉన్న నేపథ్యంలో… ప్రజల వద్దకే సేవలు అమలు చేసిన తర్వాత… మరో కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసింది. ఆదాయ మార్గాలు మూసుకుపోయిన ఈ పరిస్థితుల్లో.. ప్రతి బియ్యం కార్డు దారులకు వెయ్యి రూపాయల చొప్పన సహాయాన్ని అందించనుంది.

ఏప్రిల్ 4 న శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తోంది. నగదును సంబంధిత ఉన్నతాధికారులకు అందజేసేందుకు అవసరమైన చర్యలు కూడా పూర్తయ్యాయి. బయోమెట్రిక్ విధానాన్ని కరోనా నేపథ్యంలో నిలిపేసిన కారణంగా.. ప్రతి లబ్ధిదారునికీ సహాయ మొత్తం అందిస్తూ ఫొటో తీయించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధి మొత్తం పక్కదారి పట్టకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఉన్నతాధికారులు తెలియజేశారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి వెల్లడించారు. రేషన్ సరుకులు, పెన్షన్ల పంపిణీ విజయవంతం చేసినట్టే.. ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు అనుసరించి ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. పరిస్థితుల ఆధారంగా.. అవసరాన్ని బట్టి మరింత సాయానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

First Published:  3 April 2020 7:43 AM GMT
Next Story