Telugu Global
National

గౌతం గంభీర్ పెద్దమనసు

కరోనాతో పోరాటానికి 2 ఏళ్ల జీతం విరాళం భారత మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తన పెద్దమనసును మరోసారి చాటుకొన్నాడు. కరోనా వైరస్ నియంత్రణ కోసం భారత ప్రభుత్వం చేస్తున్న రాజీలేని పోరాటంలో తనవంతు పాత్ర నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటికే ఎంపీలాడ్స్ నిధుల నుంచి కోటి రూపాయల నిధిని…ఢిల్లీ ప్రభుత్వానికి అందచేసిన గంభీర్…వ్యక్తిగతంగా భారీవిరాళం ప్రకటించాడు. ఎంపీగా తాను అందుకోబోయే రెండేళ్ల జీతాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించాడు. ఒక్కో పార్లమెంట్ సభ్యుడు […]

గౌతం గంభీర్ పెద్దమనసు
X
  • కరోనాతో పోరాటానికి 2 ఏళ్ల జీతం విరాళం

భారత మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తన పెద్దమనసును మరోసారి చాటుకొన్నాడు. కరోనా వైరస్ నియంత్రణ కోసం భారత ప్రభుత్వం చేస్తున్న రాజీలేని పోరాటంలో తనవంతు పాత్ర నిర్వర్తిస్తున్నాడు.

ఇప్పటికే ఎంపీలాడ్స్ నిధుల నుంచి కోటి రూపాయల నిధిని…ఢిల్లీ ప్రభుత్వానికి అందచేసిన గంభీర్…వ్యక్తిగతంగా భారీవిరాళం ప్రకటించాడు. ఎంపీగా తాను అందుకోబోయే రెండేళ్ల జీతాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించాడు.

ఒక్కో పార్లమెంట్ సభ్యుడు నెలకు కనీసం రెండున్నర లక్షల రూపాయలు వేతనంగా, భత్యాల రూపంలో అందుకొంటున్నారు. గంభీర్ తన 24 నెలల జీతం ఇవ్వాలని నిర్ణయించడంతో… 40 లక్షల రూపాయల వరకూ సహాయనిధికి జమయ్యే అవకాశం ఉంది. దేశంలోని ప్రజలంతా తమకుతోచినంత మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలంటూ గంభీర్ కోరాడు.

అపూర్వీ 5 లక్షల విరాళం…

భారత మహిళా షూటర్ అపూర్వి చండీలా సైతం…తనవంతుగా 5 లక్షల రూపాయలు సాయంగా ప్రకటించింది. ప్రధానమంత్రి సహాయనిధికి 3 లక్షల రూపాయలు, రాజస్థాన్ ముఖ్యమంత్రి సహాయనిధికి 2 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపింది.

భారత షూటింగ్ క్వీన్ మేరీ కోమ్ మాత్రం…ఎంపీ హోదాలో…ఎంపీ ల్యాడ్స్ నుంచి కోటిరూపాయలు కేటాయించినట్లు తెలిపింది. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అనీల్ కుంబ్లే…. కరోనాతో పోరుకు తనవంతుగా విరాళం అందచేశారు. అయితే… అది ఎంత మొత్తమో బయటపెట్టడానికి మాత్రం ఆసక్తి చూపలేదు.

భారత క్రికెటర్స్ సచిన్ 50 లక్షలు, రోహిత్ శర్మ 80 లక్షలు, సురేశ్ రైనా 52 లక్షలు, అజింక్యా రహానే 10 లక్షలు, సౌరవ్ గంగూలీ 50 లక్షల రూపాయల బియ్యాన్ని, పీవీ సింధు 10 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు.

భారత క్రికెట్ బోర్డు 51 కోట్ల రూపాయలు, భారత హాకీ సంఘం 25 లక్షలు, భారత ఫుట్ బాల్ సమాఖ్య 25 లక్షల రూపాయలు తమవంతుగా అందచేశాయి.

భారత స్టార్ బాక్సర్ బజరంగ్ పూనియా తన ఆరుమాసాల జీతాన్ని విరాళంగా ప్రకటిస్తే…రన్నర్ హిమాదాస్…అసోం ముఖ్యమంత్రి సహాయనిధికి తనవంతుగా నెలరోజుల జీతాన్ని అందజేసింది.

భారత ప్రస్తుత కెప్టెన్ విరాట్ కొహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఇప్పటి వరకూ తాము ఎంత విరాళంగా ఇస్తున్నదీ ప్రకటించకుండా తమతమ అభిమానుల సహనాన్ని పరీక్షిస్తున్నారు.

First Published:  3 April 2020 2:38 AM GMT
Next Story