Telugu Global
National

మొబైల్ రైతు బజార్లుగా మారనున్న సిటీ బస్సులు

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఒక్క సారిగా పెరిగిపోయింది. మర్కత్ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారిలో అత్యధిక మంది పాజిటీవ్‌గా తేలడంతో కరోనా బాధితుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరంలోని కొన్ని ప్రాంతాలను ఇప్పటికే రెడ్‌జోన్ కింద చేర్చారు. అక్కడ కరోనా వ్యాప్తి కాస్త ఎక్కువగా ఉంది. దీంతో విజయవాడ నగరంలో లాక్‌డౌన్ నిబంధలను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని.. బయటకు గుంపులుగా రాకుండా.. భౌతిక దూరం పాటించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. […]

మొబైల్ రైతు బజార్లుగా మారనున్న సిటీ బస్సులు
X

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఒక్క సారిగా పెరిగిపోయింది. మర్కత్ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారిలో అత్యధిక మంది పాజిటీవ్‌గా తేలడంతో కరోనా బాధితుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరంలోని కొన్ని ప్రాంతాలను ఇప్పటికే రెడ్‌జోన్ కింద చేర్చారు. అక్కడ కరోనా వ్యాప్తి కాస్త ఎక్కువగా ఉంది. దీంతో విజయవాడ నగరంలో లాక్‌డౌన్ నిబంధలను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని.. బయటకు గుంపులుగా రాకుండా.. భౌతిక దూరం పాటించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాతో పోలిస్తే విజయవాడలోని రైతు బజార్లకు ప్రజల తాకిడి ఎక్కువగా ఉంటుండటంతో లాక్‌డౌన్ నిబంధనలకు తూట్లు పడుతున్నాయి. దీంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) కమిషనర్ ప్రసన్న కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ప్రజలు ఇండ్ల నుంచి కూరగాయల కోసం ఎక్కువ దూరం రాకుండా.. వారి ప్రాంతాల్లోనే మార్కెట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఆర్టీసీ సిటీ బస్సులను మొబైల్ రైతు బజార్లుగా మార్చాలని నిర్ణయించారు.

గురువారం ప్రయోగ పద్దతిన కొన్ని బస్సులను అద్దెకు తీసుకొని నగరంలోని పలు ప్రాంతాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేశారు. వీఎంసీ ప్రయోగానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో మరిన్ని బస్సులను రైతు బజార్లుగా మార్చాలని భావిస్తున్నారు.

విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 64 డివిజన్లు ఉన్నాయి. వీటిలో 53 డివిజన్లను కలుషిత ప్రాంతాలుగా ప్రకటించడంతో ఎవరినీ ఆయా ప్రాంతాలకు వెళ్లనీయడం గానీ.. అక్కడి వారిని బయటకు పంపడం గానీ జరగడం లేదు. వీరు నిత్యావసర వస్తువులు, కూరగాయల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేయనున్నారు.

సిటీ బస్సులకు రెండు డోర్లు ఉంటాయి కనుక.. ఒక డోర్ నుంచి ఎంట్రీ.. మరో డోర్ నుంచి ఎగ్జిట్ ఏర్పాటు చేస్తున్నారు. బస్సులోకి కూడా ఒకే సారి ఎక్కువ మందిని పంపకుండా.. భౌతిక దూరం పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు.

గురువారం మొబైల్ రైతు బజార్లు సక్సెస్ కావడంతో మరిన్ని బస్సులు తీసుకోవాలని కమిషనర్ నిర్ణయించారు. ఇప్పటికే ఆయన ఆర్టీసీ ఆర్ఎంతో చర్చలు కూడా జరిపారు. ప్రస్తుతానికి 5 సిటీ బస్సులను ఇవ్వాలని కోరగా వాటిని పంపారు. తొలి రోజు దాదాపు 8 క్వింటాళ్ల కూరగాయలు మొబైల్ రైతు బజార్ల ద్వారా విక్రయించారు.

First Published:  2 April 2020 10:28 PM GMT
Next Story