లాక్ డౌన్ లో రాజమౌళి చేస్తున్న పని ఇది

లాక్ డౌన్ లో అంతా ఇంట్లో ఖాళీగా కూర్చొని గోళ్లు గిల్లుకుంటున్నారని చాలామంది అనుకుంటున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఆ టైపు కాదు. లాక్ డౌన్ లో కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడు జక్కన్న. మొన్నటికిమొన్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి రామ్ చరణ్ లుక్ ను రిలీజ్ చేసిన రాజమౌళి.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసే పనిలో యమ బిజీగా ఉన్నాడు.

ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే.. రాజమౌళి ఉండే అపార్ట్ మెంట్స్ లోనే ఆర్ఆర్ఆర్ ఎడిటింగ్ సెటప్ కూడా ఉంది. సో.. జక్కన్న ఎటూ వెళ్లాల్సిన అవసరం లేదు. అలా ఆర్ఆర్ఆర్ పనులు శరవేగంగా సాగిపోతున్నాయి. ఇక్కడితో ఆగిపోలేదు రాజమౌళి. యూనిట్ లో కీలక సభ్యులందరికీ వాళ్లు చేయాల్సిన పనుల్ని ముందుగానే నిర్దేశించాడు. మేకోవర్ అవ్వడం, డైలాగ్స్ బట్టీ పట్టడం, రిహార్సల్స్ చేయడం, కర్రసాము నేర్చుకోవడం ఇలాంటివన్నమాట. సో.. హీరోలు, మిగతా నటీనటులు కూడా ఈ లాక్ డౌన్ టైమ్ లో బిజీ అయ్యారు.

అలా లాక్ డౌన్ టైమ్ లో షూటింగ్ లేకపోయినా.. ఆర్ఆర్ఆర్ పనులు ఆగకుండా జాగ్రత్తపడుతున్నాడు రాజమౌళి. అన్నట్టు లాక్ డౌన్ తో ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందని, వచ్చే ఏడాది జనవరిలో సినిమా రాదంటూ జరుగుతున్న ప్రచారాన్ని తాజాగా నిర్మాత డీవీవీ దానయ్య ఖండించాడు.