బిజినెస్ మేన్ తో కీర్తిసురేష్ పెళ్లి?

హీరోయిన్లు, వాళ్ల పెళ్లిళ్లు ఎప్పుడూ హాట్ టాపిక్కే. కానీ కీర్తిసురేష్ విషయంలో మాత్రం ఈ హాట్ టాపిక్ ఎప్పుడూ తెరపైకి రాలేదు. ఆమెను ఎప్పుడూ సినిమాల యాంగిల్ లోనే అంతా చూశారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ఈ “మహానటి” కూడా చేరిపోయింది. అవును.. త్వరలోనే కీర్తిసురేష్ పెళ్లి చేసుకోబోతోందట.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కీర్తిసురేష్ ఎవరితో ప్రేమలో లేదు. ఆమె ఇంట్లోనే సంబంధాలు చూస్తున్నారు. కీర్తిసురేష్ తండ్రి సురేష్ కుమార్ కు పొలిటికల్, బిజినెస సర్కిల్స్ లో మంచి పలుకుబడి ఉంది. పైగా బీజేపీతో ఇతడికి మంచి సంబంధాలున్నాయి.

ఆ కాంటాక్ట్స్ లోంచే ఓ పెద్ద బిజినెస్ మేన్ కుటుంబాన్ని సురేష్ సెలక్ట్ చేశాడని టాక్. ఆ కుటుంబానికి చెందిన ఓ బిజినెస్ మేన్ కు తన కూతుర్ని ఇచ్చి పెళ్లిచేయాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న ఈ రూమర్ పై కీర్తిసురేష్ రియాక్ట్ అవ్వలేదు.

ప్రస్తుతం కీర్తిసురేష్ చేతిలో 2 తెలుగు సినిమాలున్నాయి. వీటిలో మిస్ ఇండియా అనే సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. నితిన్ తో చేస్తున్న రంగ్ దే సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది.