Telugu Global
International

పాక్ మైనార్టీలను కరోనా నుంచి కాపాడండి

భారత క్రికెటర్లకు పాక్ మాజీ క్రికెటర్ మొర పాకిస్థాన్ లో కరోనా వైరస్ ఓ వైపు విజృభిస్తుంటే…మరోవైపు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తోంది. తూతూమంత్రంగా నివారణ చర్యలు చేపట్టి చోద్యం చూస్తోంది. అంతేకాదు పాక్ పాలకులు తమదేశంలో మైనార్టీ ప్రజలనేవారు ఉన్నారన్న వాస్తవాన్ని సైతం విస్మరించింది. సిక్కు, సింధీ, క్రిస్టియన్ మతాలకు చెందినవారే పాక్ లో ఎక్కుమంది మైనార్టీ వర్గాలుగా ఉన్నారు. ఈ వర్గాల పైన పాక్ మతఛాందసవాదులు తరచూ దాడులు […]

పాక్ మైనార్టీలను కరోనా నుంచి కాపాడండి
X
  • భారత క్రికెటర్లకు పాక్ మాజీ క్రికెటర్ మొర

పాకిస్థాన్ లో కరోనా వైరస్ ఓ వైపు విజృభిస్తుంటే…మరోవైపు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తోంది. తూతూమంత్రంగా నివారణ చర్యలు చేపట్టి చోద్యం చూస్తోంది. అంతేకాదు పాక్ పాలకులు తమదేశంలో మైనార్టీ ప్రజలనేవారు ఉన్నారన్న వాస్తవాన్ని సైతం విస్మరించింది.

సిక్కు, సింధీ, క్రిస్టియన్ మతాలకు చెందినవారే పాక్ లో ఎక్కుమంది మైనార్టీ వర్గాలుగా ఉన్నారు. ఈ వర్గాల పైన పాక్ మతఛాందసవాదులు తరచూ దాడులు చేయటం, మైనార్టీ యువతను అపహరించుకుపోయి.. పెళ్లాడి ఇస్లాంలోకి మార్చడం, మతం మార్చుకోవాలంటూ నిరంతరం ఒత్తిడి పెంచడంలో పాకిస్థాన్ లో నిత్యకృత్యమైపోయింది.

చివరకు పాకిస్థాన్ క్రికెట్ జట్టులో సైతం మైనార్టీ వర్గాల క్రికెటర్లకు చోటు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు.

గత ఏడుదశాబ్దాల పాక్ క్రికెట్ చరిత్రలో…ఏడుగురంటే ఏడుగురు మైనార్టీ వర్గాల క్రికెటర్లకు మాత్రమే చోటు ఇస్తే.. అందులో టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశాన్ని హిందూ మైనార్టీకి చెందిన అనీల్ దల్పాట్, సింధీ మైనార్టీకి చెందిన డానిశ్ కనేరియా, క్రిస్టియన్ మైనార్టీకి చెందిన యూసుఫ్ యోహానా మాత్రమే దక్కించుకోగలిగారు.

మైనార్టీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే పాక్ ప్రభుత్వం…చివరకు కరోనా వైరస్ కష్టకాలంలో సైతం మైనార్టీలను గాలికి వదిలేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోని పాక్ మాజీ క్రికెటర్ డానిశ్ కనేరియా తమను కాపాడాలంటూ ట్విట్టర్ ద్వారా భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లకు మొరపెట్టుకొన్నాడు.

తమదేశంలోని మైనార్టీ వర్గాల ప్రజలకు వైద్యసదుపాయాలు, ఆర్ధికసాయం అందించాలంటూ అర్ధించాడు.

మానవత్వమే ప్రధానం – హర్భజన్…

మరోవైపు స్వదేశంలో కరోనావైరస్ తో పోరాడకుండా…పొరుగు దేశం పాకిస్తాన్ లోని మైనార్టీల గురించి ఆలోచించడం ఏంటంటూ సోషల్ మీడియా వేదికల ద్వారా పంజాబీ పుత్తర్ లు యువరాజ్, హర్భజన్ సింగ్ లపై పలువురు మండిపడుతున్నారు.

అయితే…భారత మాజీ క్రికెటర్లు మాత్రం…ప్రస్తుత కష్టసమయంలో, విపత్కర పరిస్థితుల్లో మానవత్వమే ప్రధానమని, దేశాలు, మతాలకు చోటే లేదని తేల్చి చెప్పారు.

ప్రపంచంలోని అతిపేద దేశాలలో ఒకటైన పాకిస్థాన్ కు స్వాతంత్ర్యం వచ్చి ఏడుదశాబ్దాల కాలం కావస్తున్నా..అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటూ..భారత్ పై ద్వేషం, వ్యతిరేకతే ఆయుధాలుగా చేసుకొంటూ పబ్బం గడుపుకొంటూ వస్తోంది.

తాజా జనాభా లెక్కల ప్రకారం పాకిస్థాన్ జనాభా 22 కోట్లుగా ఉంటే…. అందులో 1.85 మాత్రమే
మైనార్టీ జనాభా ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి లెక్కలు చెబుతున్నాయి.

First Published:  3 April 2020 8:14 PM GMT
Next Story