Telugu Global
National

తెలంగాణలో కరోనా విశ్వరూపం.... 272కి చేరిన కేసులు

తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. శనివారం మరో 43 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి.దీంతో కరోనా కేసుల సంఖ్య 272కు చేరుకుంది. కరోనా బాధితుల్లో 235 మంది ఢిల్లీ మర్కజ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు, వారి కుటుంబీకులే. 165 మంది మర్కజ్‌ నుంచి నేరుగా వచ్చిన వారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 70 మందికి వీరి ద్వారా వారి కుటుంబ సభ్యులకు వైరస్‌ వ్యాపించింది. శనివారం 600 మందికి పరీక్షలు నిర్వహిస్తే 43 మందికి పాజిటివ్‌గా తేలింది. […]

తెలంగాణలో కరోనా విశ్వరూపం.... 272కి చేరిన కేసులు
X

తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. శనివారం మరో 43 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి.దీంతో కరోనా కేసుల సంఖ్య 272కు చేరుకుంది. కరోనా బాధితుల్లో 235 మంది ఢిల్లీ మర్కజ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు, వారి కుటుంబీకులే. 165 మంది మర్కజ్‌ నుంచి నేరుగా వచ్చిన వారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 70 మందికి వీరి ద్వారా వారి కుటుంబ సభ్యులకు వైరస్‌ వ్యాపించింది.

శనివారం 600 మందికి పరీక్షలు నిర్వహిస్తే 43 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆదివారం మరో 480 మంది కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అలాగే మర్కజ్‌ నుంచి వచ్చిన వారితో కాంటాక్ట్‌ అయిన సుమారు 3,300 మందికి రానున్న వారం రోజుల్లో పరీక్షలు నిర్వహించనున్నామని, అందులో సుమారు 600 పాజిటివ్‌ కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోందని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌ నుంచే 111 మంది వైరస్‌ బారిన పడ్డారు. వారిలో ఇప్పటివరకు ఏడుగురు మరణించారు. 11 మంది డిశ్చార్జి అయ్యారు. అలాగే వరంగల్‌ అర్బన్‌లో 22 పాజిటివ్‌ కేసులు తేలాయి. నిజామాబాద్‌ జిల్లాలో 19 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. వారిలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం పాజిటివ్‌గా నమోదవుతున్న కేసులన్నీ మర్కజ్‌ నుంచి వచ్చిన వారు లేదా వారితో కలిసిన వారు మాత్రమే. మర్కజ్‌ నుంచి 1,090 మంది రాష్ట్రానికి వచ్చారు. మొత్తానికి ఆదివారం మరిన్ని కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాలు రాబోతున్నాయి. దీంతో మరిన్ని కేసులు బయటపడే అవకాశముంది.

First Published:  4 April 2020 11:03 PM GMT
Next Story