Telugu Global
National

ఏపీలో కొత్తగా 34 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఇవాళ 34 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బాధితుల సంఖ్య మొత్తం 226కి చేరింది. తాజాగా కర్నూల్ జిల్లాలో 23 కేసులు, చిత్తూరు లో 7, నెల్లూరు లో 2, ప్రకాశం లో 2 కేసులు బయటపడ్డాయి. శనివారం 26 కేసులు నమోదు అయ్యాయి. రాయలసీమలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కర్నూల్ లో ఒక్కరోజులో 23 పాజిటీవ్ కేసులు బయటపడడంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. […]

ఏపీలో కొత్తగా 34 కరోనా కేసులు
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఇవాళ 34 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బాధితుల సంఖ్య మొత్తం 226కి చేరింది. తాజాగా కర్నూల్ జిల్లాలో 23 కేసులు, చిత్తూరు లో 7, నెల్లూరు లో 2, ప్రకాశం లో 2 కేసులు బయటపడ్డాయి. శనివారం 26 కేసులు నమోదు అయ్యాయి.

రాయలసీమలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కర్నూల్ లో ఒక్కరోజులో 23 పాజిటీవ్ కేసులు బయటపడడంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. నిన్నటివరకూ నాలుగు పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్న కర్నూల్ ఈరోజు 27కు చేరింది. చిత్తూరు జిల్లాలో ఒక్కరోజులో ఏడు కేసులు పెరిగాయి.

జిల్లాల వారీగా కేసుల సంఖ్య

  • అనంతపురం 3
  • చిత్తూరు 17
  • తూర్పుగోదావరి 11
  • గుంటూరు 30
  • కడప 23
  • కృష్ణా 28
  • కర్నూలు 27
  • నెల్లూరు 34
  • ప్రకాశం 23
  • విశాఖ 15
  • పశ్చిమగోదావరి 15

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క కేసు నమోదు కాలేదు. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి ఏపీకి తిరిగొచ్చిన 90 మంది కరోనా పాజిటివ్‌ బాధితుల ఇళ్లను అధికార యంత్రాంగం పూర్తిగా తమ ఆదీనంలోకి తీసుకుంది. ఆ 90మందితో పాటు వారిని కలుసుకున్న వారినీ ఇళ్లలో ఐసోలేషన్‌లో ఉంచారు.

విజయవాడలో కరోనా తొలి కేసుగా నమోదైన యువకుడు పూర్తిగా కోలుకుని శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.

First Published:  5 April 2020 1:19 AM GMT
Next Story