Telugu Global
National

లాక్‌డౌన్ మరో వారం పొడిగింపు...?

కేంద్రం వ్యూహాలకు మర్కజ్ దెబ్బ కేంద్రం కీలక నిర్ణయం 21 రోజుల లాక్‌డౌన్ మరో వారం రోజులు పెరగబోతోందా..? ఈ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతోందా? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. కరోనా కట్టడి వ్యూహాల్లో భాగంగా డబ్ల్యూహెచ్‌వో జారీ చేసిన మార్గదర్శకాల్లో లాక్‌డౌన్ ఒకటి. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న వేళ తొలుత ఒక రోజు ‘జనతా కర్ఫ్యూ’ విధించిన కేంద్ర ప్రభుత్వం.. రెండు రోజుల తర్వాత పూర్తి లాక్‌డౌన్ ప్రకటించింది. […]

లాక్‌డౌన్ మరో వారం పొడిగింపు...?
X
  • కేంద్రం వ్యూహాలకు మర్కజ్ దెబ్బ
  • కేంద్రం కీలక నిర్ణయం

21 రోజుల లాక్‌డౌన్ మరో వారం రోజులు పెరగబోతోందా..? ఈ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతోందా? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. కరోనా కట్టడి వ్యూహాల్లో భాగంగా డబ్ల్యూహెచ్‌వో జారీ చేసిన మార్గదర్శకాల్లో లాక్‌డౌన్ ఒకటి. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న వేళ తొలుత ఒక రోజు ‘జనతా కర్ఫ్యూ’ విధించిన కేంద్ర ప్రభుత్వం.. రెండు రోజుల తర్వాత పూర్తి లాక్‌డౌన్ ప్రకటించింది. 21 రోజుల లాక్‌డౌన్ వెనుక కేంద్ర ప్రభుత్వ వ్యూహాలు చాలా ఉన్నాయి.

లాక్‌డౌన్ ప్రకటించే సమయానికి విదేశాల నుంచి వచ్చే విమానాలు ఆగిపోయాయి. దీంతో 14 రోజుల్లో ఎంత మంది పాజిటీవ్, నెటిటీవ్ అనే విషయాలు వెల్లడవుతాయని.. ఆ తర్వాత కూడా మరో 7 రోజుల సమయం ఉంటుంది కాబట్టి.. కరోనాను పూర్తిగా కట్టడి చేసేయవచ్చని భావించింది.

తొలి వారం అనుకున్నట్లుగానే లాక్‌డౌన్ విజయవంతం అయినా.. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలు కేంద్ర వ్యూహాన్ని దెబ్బతీసింది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారు 16 రాష్ట్రాల్లో ఉన్నారు. ఇప్పటి వరకు దేశంలో బయటపడిన కరోనా పాజిటీవ్ కేసుల్లో 30 శాతం మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారే అని కేంద్రం గుర్తించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.

తబ్లిగీ సమ్మేళనానికి వెళ్లిన వారు స్వచ్చందంగా ముందుకు రావట్లేదు.. ఇప్పటికే అందరినీ గుర్తించామని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇంకా కొంత మంది అజ్ఞాతంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కాబట్టి ఇప్పుడు లాక్‌డౌన్ ఎత్తేస్తే పరిస్థితి చేయి దాటి పోతుంది కాబట్టి మరో వారం రోజులైనా పొడిగించి అందరినీ క్వారంటైన్‌కు తరలించాల్సిందేనని కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రధానికి సూచించినట్లు తెలిసింది. దీంతో ప్రధాని ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

First Published:  5 April 2020 12:57 AM GMT
Next Story