ఒకే రోజు 62 కరోనా కేసులు… మరో 2 రెండు రోజులు కీలకం

తెలంగాణలో కరోనా కేసులు మూడు వందలు దాటాయి. ఒకే రోజు 62 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకూ 334 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ 11 మంది మృతి చెందారు. పాజిటివ్‌ కేసుల నుంచి 33 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో 289 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు ఉన్నాయి.

ఒక్క హైదరాబాద్‌లో కొత్తగా 19 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇక్కడ కేసుల సంఖ్య 149కి చేరింది. ఇప్పటికే పది మంది డిశ్చార్జి కావడంతో 139 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా లెక్కలు చూస్తే

 • హైదరాబాద్‌ 139
 • వరంగల్‌ అర్బన్‌ 23
 • నిజామాబాద్‌ 19
 • నల్గొండ 13
 • మేడ్చల్‌ 12
 • రంగారెడ్డి 11
 • ఆదిలాబాద్ 10
 • కామారెడ్డి 8
 • సంగారెడ్డి 7
 • కరీంనగర్‌ 6
 • గద్వాల 5
 • మెదక్‌ 5
 • వికారాబాద్‌ 4
 • భద్రాద్రి కొత్తగూడెం 3
 • మహబూబ్‌నగర్‌ 3
 • నాగర్‌కర్నూలు 2
 • జగిత్యాల 2
 • జనగాం 2
 • సూర్యాపేట 2
 • ములుగు 2
 • భూపాలపల్లి 1
 • మహబూబాబాద్ 1
 • నిర్మల్‌ 1
 • పెద్దపల్లి 1
 • సిద్దిపేట 1

హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ అర్బన్‌లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక్కడ 23 మంది బాధితులు తేలారు. ఇంకా చాలా మంది రక్తనమూనాలను టెస్ట్‌కు పంపించారు. దీంతో రాబోయే రెండు రోజుల్లో పెద్ద ఎత్తున పాజిటివ్‌ కేసులు తేలే అవకాశం ఉంది. అలర్ట్‌గా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించారు.