అనిల్ రావిపూడి కొత్త చిత్రం ఇదే.!

ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తీసిన దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరిచిత్రం ఏంటనేదానిపై ఇంతవరకు నోరు విప్పలేదు. ప్రస్తుతం అభిమానులంతా ఈ యంగ్ టాలెంటెడ్ దర్శకుడు ఎలాంటి సినిమా… ఎవరితో తీస్తాడనేదానిపై ఆసక్తిగా ఉన్నారు. అయితే అనిల్ రావిపూడి తదుపరి చిత్రం వీరితోనే అనే ఊహాగానాలు టాలీవుడ్ లో వ్యాపిస్తున్నాయి.

కరోనా వైరస్ ను నియంత్రించడానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో అనిల్ రావిపూడి తన సమయాన్ని అంతా ఇప్పుడు తదుపరి స్క్రిప్ట్ మీదే పెట్టాడు. కొత్త చిత్రం స్క్రిప్ట్ పూర్తి చేయడంపైనే కేటాయించారు.

పోయిన సంవత్సరం వచ్చిన ఎఫ్2 బిగ్గెస్ట్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి కొనసాగింపుగా అనిల్ రావిపూడి ఎఫ్3 సిద్ధం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ కొత్త చిత్రం ఎఫ్2ను మించిన వినోదం, సరదాగా ఉంటుందని ప్రచారం సాగింది.

ఈ ఎఫ్3లో వెంకటేశ్, వరుణ్ తేజ్ తోపాటు రవితేజ కూడా నటించబోతున్నాడని అంటున్నారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి తన రచనా బృందంతో కలిసి తన గ్రామంలోని ఇంట్లోనే స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.