Telugu Global
National

కరోనాపై సీరియస్ యాక్షన్... ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితుల్లో.. ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని నిర్ణయం తీసుకుంది. కఠిన చర్యల అమలుతోనే వైరస్ వ్యాప్తిని నియంత్రించగలమన్న నిర్ణయానికి వచ్చింది. ఈ విషయంపైనే ముఖ్యమంత్రి జగన్.. వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో కరోనా పైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కార్యాచరణ అమలుపై ఆరా తీశారు. పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు.. కఠిన చర్యలను సీఎం ప్రతిపాదించారు. […]

కరోనాపై సీరియస్ యాక్షన్... ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితుల్లో.. ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని నిర్ణయం తీసుకుంది. కఠిన చర్యల అమలుతోనే వైరస్ వ్యాప్తిని నియంత్రించగలమన్న నిర్ణయానికి వచ్చింది. ఈ విషయంపైనే ముఖ్యమంత్రి జగన్.. వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో కరోనా పైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కార్యాచరణ అమలుపై ఆరా తీశారు. పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు.. కఠిన చర్యలను సీఎం ప్రతిపాదించారు. అందులో ముఖ్యమైనది.. కరోనా పాజిటివ్ అని తేలిన వారి ఇళ్ల చుట్టూ కిలోమీటరు పరిధిలో ఆంక్షలు విధించడం. సిబ్బందితో ర్యాపిడ్ సర్వే చేయించడం. ఇందులో.. ఎవరైనా బాధితులు ఉన్నారేమో గుర్తించి తగిన చికిత్స అందించడం. ఈ క్రమంలో.. ఒకే ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా కరోనా పాజిటివ్ గా తేలితే.. అక్కడి రాకపోకలు పూర్తిగా ఆపేసి.. మరింత కఠినంగా వ్యవహరించడం. ఈ నిర్ణయాన్ని సత్వరమే అమల్లోకి అధికారులు తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు.

మరో ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే.. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో.. హైపో క్లోరైడ్ వంటి వైరస్ నాశక రసాయనాలు చల్లించడం. పారిశుద్ధ్య కార్యక్రమాలు మరింత విస్తృత పరచడం. తద్వారా.. ఎప్పటికప్పుడు వైరస్ ను నశింపజేసేలా చర్యలు తీసుకుంటే.. వ్యాప్తిని అరికట్టేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్యనూ మరింత విస్తృతంగా అమలు పరచాలన్న ఆదేశం ఉన్నతాధికారులకు అందింది.

మూడో నిర్ణయం.. జియో ట్యాగింగ్. పాజిటివ్ కేసులున్న ప్రాంతాలు, మర్కజ్ యాత్రికులు ఉన్న ప్రాంతాలు, హోం క్వారంటైన్లతో పాటు.. క్వారంటైన్ కేంద్రాలు ఉన్న భవనాలు, ఆస్పత్రులను జియో ట్యాగ్ చేయడం ద్వారా.. అక్కడి పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం.. ఆ ప్రకారంగా చర్యలు వేగవంతం చేయడం వంటి ప్రణాళికను రూపొందించారు. ఇప్పటికే అమలవుతున్న జియో ట్యాగింగ్ ను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు.

వీటికి తోడు.. మరిన్ని చర్యలను అప్పటికప్పుడు పరిస్థితుల ఆధారంగా అమలు చేస్తూ.. సమస్యను త్వరగా పరిష్కరించడమే లక్ష్యంగా మంత్రులు, ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి జగన్ దిశా నిర్దేశం చేశారు.

First Published:  6 April 2020 7:19 AM GMT
Next Story