కీర్తిసురేష్ పెళ్లి చేసుకుంటోందా?

ఇదే ప్రశ్న 2 రోజులుగా తెగ చక్కర్లు కొడుతోంది. ఆమె ఇక సినిమాలు ఆపేసి పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతుందని, ఈ మేరకు ఆమె తండ్రి సురేష్ ఓ మంచి వ్యాపారవేత్త సంబంధం కూడా చూశాడంటూ కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. కాస్త ఆలస్యంగానైనా దీనిపై స్పందించింది కీర్తిసురేష్. ప్రస్తుతానికి తనకు పెళ్లి ఆలోచన లేదని స్పష్టంచేసింది.

పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో కీలకమైనదేనని, తన జీవితంలో కూడా పెళ్లికి ప్రాధాన్యం ఉందని తెలిపిన కీర్తిసురేష్.. దానికింకా టైమ్ రాలేదని స్పష్టంచేసింది. తన కోసం ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖండించిన కీర్తిసురేష్.. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని అంటోంది.

ఈ సందర్భంగా మరో క్లారిటీ కూడా ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తను లవ్ మ్యారేజ్ చేసుకోనని, ఇంట్లో చూసిన సంబంధమే చేసుకుంటానని తెలిపింది. అయితే దానికింకా టైమ్ ఉందని.. తెలుగు, తమిళ భాషల్లో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నట్టు తెలిపింది కీర్తిసురేష్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో మిస్ ఇండియా, రంగ్ దే సినిమాలు చేస్తోంది. వీటిలో మిస్ ఇండియా సినిమా రిలీజ్ కు రెడీ అవ్వగా.. రంగ్ దే సెట్స్ పై ఉంది.