మహేష్-త్రివిక్రమ్ కాంబో సెట్టవ్వడం కష్టమేనా?

కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ లన్నీ వాయిదా పడ్డాయి. దీంతో సినీ సెలబ్రెటీలంతా ఇళ్లకే పరిమితయ్యారు. హీరోలు, దర్శకులు వేసుకున్న సినిమా ప్లాన్ లన్నీ రివర్స్ అయ్యాయి. కరోనా కారణంగా ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ కొనసాగే పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో ఇప్పట్లో కొత్త సినిమా షూటింగ్ లు, వాయిదాపడిన సినిమాలు ప్రారంభమయ్యేలా కన్పించడం లేదు. ఇదిలా ఉంటే త్వరలోనే మహేష్-త్రివిక్రమ్ కాంబోలో ఓ మూవీ ఉండనుందనే ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై సోషల్ మీడియాలో అభిమానులు విభిన్నంగా స్పందిస్తుండటం ఆసక్తిని రేపుతోంది.

మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో ‘ఖలేజా’ మూవీ వచ్చింది. ఈ మూవీ బిగ్ స్ర్ర్కీన్ పై అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ బుల్లితెరపై మాత్రం ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరోమూవీ వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పటివరకు అలాంటిదేమీ జరుగలేదు.

ఇటీవలే మహేష్ బాబు ‘సరిలేరునీకెవ్వరు’ మూవీతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్టందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. అదేవిధంగా త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. ఈ మూవీ తెలుగు, మలయాళంతోపాటు యూఎస్ లోనూ మంచి విజయం సాధించింది. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబో తెరపైకి వచ్చింది. మహేష్ మూవీని హరిక హాసిని కాకుండా బయటి బ్యానర్లో త్రివిక్రమ్ తెరకెక్కిసాడని ప్రచారం జరుగుతుంది. మహేష్ కు హరిక-హాసిని బ్యానర్ కు మధ్య మంచి సంబంధాలు లేనట్లు తెలుస్తోంది. గతంలో మహేష్ బాబుకు ఇచ్చిన అడ్వాన్స్ ఈ సంస్థ వెనక్కి తీసుకోవడంతో వీరిమధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా మైత్రీ సంస్థ నుంచి సినిమా కోసం తాను తీసుకున్న అడ్వాన్స్ ఇటీవలే తిరిగిచ్చేశారు. దీంతో ఈ రెండు బ్యానర్లు కాకుండా మరో బ్యానర్ సెట్టయితే తప్ప త్రివిక్రమ్-మహేష్ కాంబో తెరకెక్కేలా కన్పించడం లేదు.

‘సరిలేరునీకెవ్వరు’ మూవీని తెరకెక్కించిన దర్శకుడు అనిల్ రావిపూడి తోనే మహేష్ తదుపరి మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి ప్రస్తుతం ‘ఎఫ్-3’ మూవీ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంకా ఈ సినిమా స్టార్ట్ కాలేదు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ ఉంటుందని గాసిప్స్ మొదలయ్యాయి. అలాగే దర్శకుడు పరుశురాంతో సినిమా చేసేందుకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ఎవరో ఒకరితో మహేష్ మూవీ త్వరలోనే ఉండనుందని తెలుస్తోంది.

అదేవిధంగా త్రివిక్రమ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో త్వరలోనే మూవీ ప్రారంభం కానుందని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘అరవింద సమేత’ మంచి హిట్టందుకున్న సంగతి తెల్సిందే. దీంతో మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ ఇప్పట్లో రావడం అనేది దాదాపు అసాధ్యంగానే కన్పిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్లో మరో మూవీ సెట్టయితే చూడాలని అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు. చూడాలి మరీ ఏం జరుగుతుందో..!