Telugu Global
International

ఐసీయూలో బ్రిటన్‌ ప్రధాని.... ఆందోళనలో సిటిజన్స్‌

కరోనా వైరస్‌ సోకిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు..ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. మార్చి 26న ఆయనకు కరోనా పాజిటివ్‌ రావడంతో అప్పటి నుంచి స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఇంటి నుంచే పాలన సాగించారు. ఐతే 10 రోజుల తర్వాత కూడా కరోనా నుంచి కోలుకోకపోవడంతో.. సోమవారం లండన్‌లోని సెయింట్‌ థామస్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కరోనా తీవ్రమవడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఐసీయూలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న బోరిస్‌ జాన్సన్‌ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని మోదీ […]

ఐసీయూలో బ్రిటన్‌ ప్రధాని.... ఆందోళనలో సిటిజన్స్‌
X

కరోనా వైరస్‌ సోకిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు..ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. మార్చి 26న ఆయనకు కరోనా పాజిటివ్‌ రావడంతో అప్పటి నుంచి స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఇంటి నుంచే పాలన సాగించారు. ఐతే 10 రోజుల తర్వాత కూడా కరోనా నుంచి కోలుకోకపోవడంతో.. సోమవారం లండన్‌లోని సెయింట్‌ థామస్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కరోనా తీవ్రమవడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఐసీయూలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న బోరిస్‌ జాన్సన్‌ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అతి త్వరలోనే ఆయన కరోనాను జయించి ఆస్పత్రి నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నానని ట్వీట్‌ చేశారు.

జాన్సన్‌ను ఐసీయూకు తరలించడం బాధగా ఉందన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌. జాన్సన్‌ తనకు మంచి స్నేహితుడని..కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అమెరికా ప్రజలంతా బోరిస్‌ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారని.. బ్రిటన్‌ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సాయమందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా అనేకమంది దేశాధినేతలు జాన్సన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ కూడా బోరిస్‌ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అతి త్వరగా ఆయన కరోనా నుంచి కోలుకోవాలన్నారు.

ప్రపంచవ్యాప్తంగా నిత్యం వేలాది మంది ప్రాణాల్ని బలిగొంటున్న ఈ మహమ్మారి..ఇప్పుడు ఏకంగా ఓ దేశాధినేతనే తీవ్ర అనారోగ్యానికి గురిచేయడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బోరిస్‌ జాన్సన్‌ కరోనాను జయించి అతి త్వరగా ఆస్పత్రి నుంచి బయటకు రావాలని యావత్‌ ప్రపంచం కోరుకుంటోంది.

First Published:  7 April 2020 7:23 AM GMT
Next Story