Telugu Global
NEWS

క్రికెట్ మక్కా లార్డ్స్ లో త్రి-శతక వీరుడు

క్రికెట్ జీవితం పరిపూర్ణమన్న దిలీప్ వెంగ్ సర్కార్ ప్రపంచ క్రికెట్ కు భారత్ ఎందరో గొప్పగొప్ప క్రికెటర్లను అందించింది. అందులో ఎక్కువమంది దిగ్గజ క్రికెటర్లు ముంబై నుంచే వచ్చారు. వారిలో ఎవరి ప్రత్యేకత వారిదే. నాటితరం నుంచి నేటితరం వరకూ..విజయ్ మర్చెంట్, దిలీప్ సర్దేశాయి, సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్, సంజయ్ మంజ్రేకర్, వాసిం జాఫర్, అమోల్ ముజుందార్, రవిశాస్త్రి, రోహిత్ శర్మలాంటి మొనగాళ్లు ఎందరో వెలుగులోకి వచ్చినా… మాజీ కెప్టెన్, కర్నల్ దిలీప్ వెంగ్ సర్కార్ […]

క్రికెట్ మక్కా లార్డ్స్ లో త్రి-శతక వీరుడు
X
  • క్రికెట్ జీవితం పరిపూర్ణమన్న దిలీప్ వెంగ్ సర్కార్

ప్రపంచ క్రికెట్ కు భారత్ ఎందరో గొప్పగొప్ప క్రికెటర్లను అందించింది. అందులో ఎక్కువమంది దిగ్గజ క్రికెటర్లు ముంబై నుంచే వచ్చారు. వారిలో ఎవరి ప్రత్యేకత వారిదే.

నాటితరం నుంచి నేటితరం వరకూ..విజయ్ మర్చెంట్, దిలీప్ సర్దేశాయి, సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్, సంజయ్ మంజ్రేకర్, వాసిం జాఫర్, అమోల్ ముజుందార్, రవిశాస్త్రి, రోహిత్ శర్మలాంటి మొనగాళ్లు ఎందరో వెలుగులోకి వచ్చినా… మాజీ కెప్టెన్, కర్నల్ దిలీప్ వెంగ్ సర్కార్ స్టయిలే వేరు.

1970-1980 దశకంలో భారత దిగ్గజ బ్యాట్స్ మన్ లో ఒకనిగా గుర్తింపు పొందిన దిలీప్ వెంగ్ సర్కార్ కు పలు అరుదైన రికార్డులు ఉన్నాయి.

కొద్దిరోజుల క్రితమే 64వ జన్మదినం జరుపుకొన్న వెంగ్ సర్కార్…తన కెరియర్ లోని మధురఘట్టాలను, తీపిజ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకొన్నాడు.

అంతా లలాట లిఖితమే….

తాను విధిరాతను నమ్ముతానని, మనం ఏంచేయాలని ఉందో అదే చేస్తామని తాత్విక ధోరణితో చెప్పాడు. క్రికెటర్ గా తన కెరియర్ ను పరిపూర్ణంగా గడిపానని వెంగీ ప్రకటించాడు.

స్వింగ్ బౌలింగ్ ను, స్పిన్ బౌలింగ్ ను అలవోకగా ఎదుర్కోగలగడం, అవలీలగా సిక్సర్లు బాదడం, సొగసుగా షాట్లు కొట్టడంలో వెంగ్ సర్కార్ కు వెంగ్ సర్కార్ మాత్రమే సాటి.

సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్ లకు వచ్చినంత పేరు, గుర్తింపు తనకు రాకపోయినా…భారత చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానం సంపాదించుకొన్నాడు.

లార్డ్స్ లో అరుదైన రికార్డులు….

క్రికెట్ మక్కా లార్డ్స్ లో శతకం సాధించాలని క్రికెటర్లు కలలు కంటూ ఉంటారు. అయితే సచిన్ టెండుల్కర్ లాంటి ఆల్ టైమ్ క్రికెటర్ లండన్ లోని లార్డ్స్ స్టేడియంలో సెంచరీ సాధించలేకపోయాడు.

అయితే…దిలీప్ వెంగ్ సర్కార్ మాత్రం.. లార్డ్స్ మైదానంలో ఒకటికాదు, రెండు కాదు…ఏకంగా మూడుశతకాలు బాదిన ఏకైక విదేశీ, భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.

తన కెరియర్ లో 116 టెస్టులు ఆడటమే కాదు…129 వన్డేలు ఆడిన రికార్డు సైతం వెంగీకి ఉంది. కపిల్ దేవ్ నాయకత్వంలో ప్రపంచకప్ సాధించిన భారతజట్టులో దిలీప్ వెంగ్ సర్కార్ సభ్యుడిగా ఉన్నాడు.

స్వదేశీ టెస్ట్ సిరీస్ ల్లో వెస్టిండీస్ ప్రత్యర్థిగా ఆరు సెంచరీలు సాధించిన ఘనత కూడా వెంగీకి ఉంది. భారత క్రికెట్ కు సెలెక్టర్ గా, చీఫ్ సెలెక్టర్ గా సేవలు అందించిన వెంగ్ సర్కార్ తనపేరుతో ఓ అకాడెమీని నిర్వహించడంతో పాటు…క్రికెట్ కు పలురకాలుగా సేవలు అందిస్తున్నారు.

ప్రపంచ క్రికెట్ కు భారత్ అందించిన సొగసరి క్రికెటర్లలో మన్సూర్అలీఖాన్ పటౌడీ, ఎంఎల్ జైసింహాల సరసన దిలీప్ వెంగ్ సర్కార్ సైతం నిలిచిపోగలుగుతాడు.

First Published:  7 April 2020 7:20 AM GMT
Next Story